5, ఏప్రిల్ 2017, బుధవారం

పల్లకి

అంగరంగ వైభవంగా
అత్తవారింట అడుగుపెట్టు తరుణమది...
తనదయిన నవ జీవితంలోకి 
ఆశగా అడుగుపెట్టు వధువుకు
జీవితపు వడి దుడుకులకు
తొలి మజిలీ నేనే అంటోందా పల్లకి!
పుట్టినింట పుత్తడిబొమ్మకి
మెట్టినింటికి దారి పరచి
కడ దాకా రాలేనన్న సంగతి మరచి
మురిపెంగా నేనున్నా అంటొంది ఆ పల్లకి!
కంటిపాపలా పెంచిన వారు
కంటి కొనలు దాటిపోతుంటే...
కనులెదట మనువాడినవాడుండగా
కంటికొలనులో కన్నీరెందుకే అంటోంది ఆ పల్లకి!
మది నిండా మమకారపు అలోచనలు సుడిగుండాలయి
యెద నిండా యేలుకునే వాడిపై యేకాగ్రత కుదరక
బరువెక్కిన హ్రుదయంతొ భారంగా కూర్చున్న వధువు
భారం కాసేపయినా మోయనివ్వమని ముందుకు కదిలిందా పల్లకి!!!
శుభోదయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...