28, ఏప్రిల్ 2017, శుక్రవారం

నా దేశం

ఎప్పుడు చూస్తానో
గాంధీ కలలు కన్న దేశాన్ని...
లంచం లేని ప్రభుత్వాన్ని...
నిస్స్వార్థ రాజకీయనాయకులని...
అర్థరాత్రి కూడా ఆడవాళ్లు క్షేమంగా సంచరించే రాజ్యాన్ని....

ఎప్పుడు చూస్తానో
ఆటంకావాదులు లేని భారత దేశాన్ని....
కుల, మత బేధాలు లేని సంఘాన్ని...
కాలుష్యం లేని పట్టణాలని...
పచ్చని చెట్లు, పైర్లతో నిండే భూమిని...
నీటితో కళ కళ లాడే జీవనదులని.....
ఎప్పుడు చూస్తానో...
నేను ఎప్పుడు చూస్తానో....
ఇంకెప్పుడు చూస్తానో🤔

ఒక్కోసారి..

ఒక్కోసారి..
గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది..
ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది..
వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది..
ఒక్కోసారి..
పరిచయంలేని
అపరిచితుల వద్దే
మనసు విప్పాలనిపిస్తుంది..
సమాధానం కన్నా
చిరునవ్వే చాలనిపిస్తుంది..
కళ్ళు మూసుకుని
గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది..
ఒక్కోసారి..
కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది..
నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది..
మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది..
ఒక్కోసారి.
నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది..
వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది..
మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది.. !

బాల్యం

మధురమైన బాల్యానికి తిరిగివెళ్లిపోతే
ఎంత బాగున్నో !!
అమ్మ వడిలో
ఆద మరిచి 
నిద్ర పోతే
ఎంత బాగున్నో!!

నానమ్మ
చందమామ కథలు
వింటూ....
అమ్మ చేతి కమ్మనైన గోరుముద్దలు తింటూ...
నాన్న దగ్గర
ముద్దు, మురిపాలు
కురుస్తూ ఉంటే
ఎంత బాగున్నో!!
గుజ్జన గూళ్ళు
కట్టుకుంటు
ఇసుకతో తల మీంచి తలంబ్రాలుగా
పోసుకుంటే
ఎంత బాగున్నో!!
తాత బడ్డీలో
బెల్లం కడ్డీలు,
జీళ్ళు తింటూ,
స్కూల్ కి వెళ్తే ,
ఎంత బాగున్నో!!
పండగ నాడు,
పట్టు పరికిణి జాకెట్టు
వేసుకొని,
చేమంతి పూల జడ
కుట్టుకుంటే
ఎంత బాగున్నో!!
అలా అన్ని
మరచిపోయి
అలుపు ఎరుగని
బాల్యంలోనే ఉండిపోతే
ఎంత బాగున్నో
ఇంకెంత బాగున్నో!!🤔

25, ఏప్రిల్ 2017, మంగళవారం

ఉత్తరం

చిఠీ ఆయి హై ఆయి హై చిఠీ ఆయి హై
పంకజ్ ఉదాస్ గారి పాట దూరంగా రేడియో లో వినిపిస్తోంది...
విని ముఖంలో నవ్వుతో కూడిన భాద పెల్లు బెక్కింది..
ఇక ఈ చిఠీలు అవి పాటల వరకే పరిమితం..
ఇప్పుడెక్కడ అసలి ఎవరికైనా ఈ కాలంలో పిల్లలకి కార్డ్, ఇన్లాండ్, enevelope లు అంటే అసలు తెలుసా అన్న అనుమానం కూడా రాకపోలేదు నాకు..
ప్చ్..అంత మారి పోయింది
ఆ రోజుల్లో పోస్ట్ మాన్ కోసం పడిగాపులు కాసుకొని కూర్చినే వాళ్ళం..నేను మా అక్క వాళ్ళు..
ఉత్తరం ఏదైనా వస్తే ఎవరు మొదట తీసుకొని చదువుతారో అన్నది మా మధ్య పోటీ.....
నేను అందరి కంటే చిన్న దాన్ని అవ్వడం వల్ల బాగా పేచీలు పెట్టి లాక్కొని, నేనె మొదట చదివే దాన్ని..
అయిన అప్పట్లో వచ్చిన లెటర్ బట్టి ఎవరు రాసేరో దేనికోసమొ అంచనా వేసేవాళ్ళం.
కార్డ్ ఐతే ఏ చావొ, లేక పుట్టుక గురించో
లేకపోతే మా మావయ్య రాసేవారు......
ఒరే రమణ నువ్వు, భార్య పిల్లలు క్షేమం అని తలుస్తాను.
ఇక్కడ నేను, మా అమ్మ , భార్య పిల్లలు క్షేమంగా
ఉన్నాము. అత్తగారికి మా
పాదాభివందనములు..
ఇట్లు ఆశీర్వదించి
మీ బావగారు అని కొట్టి నట్లు మూడు ముక్కలే ఉండేవి..
ఇన్లాండ్ ఐతే మా అత్తొ మా పిన్నో రాసేవాళ్ళు...దాంట్లో కూడా షరా మాములే..కాకపోతే కొంచెం ఎక్కువ చదవడానికి ఉండేది మా అత్త ప్రతి ఏడూ లాగే రాసేది వదిన నాకోసం కూడా ఏభై కాయలు ఆవకాయ పెట్టు. దాంట్లో పాతిక కాయలు పచ్చి ఆవకాయ ముక్కలు, పాతిక ఎండు ఆవకాయ ముక్కలు చాల్లే..ఒక పది కాయలు మాత్రం మాగాయి పచ్చడి పెట్టు....చింత పండు ఐదు కేజీలు పిక్క తీసి ఉంచండి. వదిన...కుంకుడికాయలు కూడా ఒక ఐదు కేజీలు చాలు...ఇలా అన్ని బయటకు చదువుకొని కడుపు ఉబ్బ నవ్వే వాళ్ళం.
ఎందుకంటే చింతపండు పిక్క తియ్యడం మా పనే కనుక ...రాబోయే భూకంపం ఉత్తరం ధర్మాన మొదటే తెలిసేది.
envelope ఐతే మా అక్క కోసం మా బావ రాసేవాడు..
ప్రేమ లేఖ కానీ ప్రేమ లేఖ.. ఏడిపించి ఏడిపించి చదివేసి ఇచ్చేదాన్ని..
ఎదురు చూసిన ఉత్తరం లేట్ గా వస్తే ఉత్తరం పైన స్టాంప్ మీద date చూసి పోస్ట్ మాస్టర్ తో తగువులు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు..అంత ఎదురు చూసే వాళ్ళం మరి.
గుండెలో దాచుకున్న బాధల్ని, సంతోషాల్ని ఎక్కువుగా చెప్పుకుందికి అవకాశం లేక నాలుగు అక్షర ముక్కల్లో ఉత్తరాల పేరిట తెలియ పరిచేవారు...
అందుకే కలసినపుడు చెప్పుకుందికి బోలెడన్ని విశేషాలు, ఊసులు ఇంకా మిగిలిపోయేవి..ఇప్పటి లాగా ఇన్ని సదుపాయాలు లేకపోవడం వల్ల ఒక ఊరునుండి ఇంకో ఊరికి ప్రయాణాలు కూడా కష్టమే అందుకే ఎక్కడికైనా వెళ్లినపుడే అవకాశం ఉన్నన్ని రోజులు ఉండిపోయేవారు ..
అందుకే కలసినపుడు మాట్లాడుకుందికి మాటలు, ఎక్కువ రోజులు కలసి ఉండడం వల్ల అభిమానాలు, ప్రేమలు కూడా ఎక్కువగానే ఉండేవి..ఒకరితో ఒకరు adjust అవ్వడం కూడా బాగా అలవాటయ్యేది.
ఇప్పుడు టెక్నాలజీ బాగా develop అవ్వడం మనుషులకు చాలా వరకు మేలు జరిగిన నిత్య జీవితంలో చిన్న చిన్న ఆనందాలు మాత్రం మిస్ అవుతున్నాము అన్న మాట నిజం.
what,s app, Face book, Skype, video chatting ల వల్ల మన వాళ్ళ యోగ క్షేమలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగిన...కలసుకున్నపుడు పూర్వ కాలంలో లాగ ఉండే ఆత్రుత, అభిమానం కాన రాటంలేదు..అని నా అభిప్రాయం అనుకోండి..
అప్పట్లో ఊసిపోక పోయిన లేద మనుషులు జ్ఞ్యాపకం వచ్చిన పదే పదే వాళ్ళ ఉత్తరాలు చదువుకొని మురిపోయేవారు..
ఏది ఏమైనా ఎవరో మహానుభావుడు అన్నట్టు పోయినోళ్లు
అందరూ మంచోళ్ళు....
గడచిన రోజులు అన్ని మధురానుభూతులు..అని నిట్టూర్చడం తప్ప చేయ గలిగింది ఏమీలేదు...
🤔
రేణుక సుసర్ల
Art Work By : Sadasivuni Madhurasree

వేదన

యదలోతుల్లో......
ఆలోచనల అగ్నిగుండం.....
చేసిన బాసలు మరచిన వాడు,
చేరువులో లేడు.
కథలెన్నో చెప్పాడు, 
కలలు మాత్రమే మిగిల్చాడు.
నేనె తన ఊపిరి అన్నాడు,
నా శ్వాసనే ఆపేశాడు.
తన ఊహల పూదోటలో,
విర బూసిన పూవు అన్నాడు.
తావి లేని పూవుగా మిగిల్చాడు.
హృదయం బరువెక్కి,
తడిసిన మేఘాల వలే,
తలుపు తడితే,
కనురెప్పలు కురియమని
దారీయగా..
కంటి పాపే,
ఆకాశమై వర్షించింది.
మృదువైన నీ చేయి,
నా భుజం తట్టగా,
నీకు నేనున్నానని,
నీ మూగ కళ్ళు ,
మవునంగా చెప్పాయి..
కోరుకున్న వాడు కూల దోస్తే,
ఆదుకున్న వాడు,
ఆత్మీయుడయ్యాడు.
రేణుక సుసర్ల

గరం గరం

ఎండాకాలం అంటే
అందరికి పరేషాన్
కూర్చుందా మంటే
కుర్సీ గరం
ఆనుకుందాం మంటే 
తలుపులు గరం
బయటకెళ్తే నగరం
అంత గరం గరం
శ్వాస తీసుకుందామంటే
పీల్చే గాలి గరం
శ్వాస తీయకపోతే
మనిషి బతుకే ఘోరం
ఎండ ధాటికి
శాంతి మంతుల
దిమాక్ కూడా గరం.
ఆడవాళ్ళ బాధ
ఇంకా ఘోరం
మేకప్ వేసుకుంటే
చెమటకి పరేషాన్
వేసుకోకపోతే
తరుగుతుంది వాళ్ల షాన్.
తాగుతున్నారు
చల్లని పానీయాలు...
గొంతులో దిగుతూ 

ఉంటే గమ్మత్తు
ఐ పోయాక
వదులుతుంది మత్తు...
ఎండ నుండి కాపడుకుందుకి
పడుతున్నారు పాట్లు
అయిన
తప్పటం లేదు ఇక్కట్లు.

రేణుక సుసర్ల

కాగితం

అందరికి
నేస్తాన్ని నేను...
ముత్యమంత
మనసున్న దాన్ని....
నా ముందు అందరూ.....
మనసుతో మాట్లాడతారు.
మనసుని ,
నామీద అక్షర రూపంలో, పెడతారు...
మనిషికి
పుట్టిన దగ్గర నుండి,
కట్ట కాలే దాకా,
నేనే సాక్షిని...
ముక్కోటి దేవతల,
సాక్షిగా జరిగిన ,
పెళ్లి కి కూడా ,
నేనే మొదటి సాక్షిని.....
నేను లేనిదే,
మనిషికి విలువేలేదు.....
మనిషి ఒదిగేది ,
నా ఎదుటే....
ఎదిగేది నా ఎదుటే....
పయనించేది నా తోటే....
జీవించేది నా తోటే...
గమ్యము నేనే
ఆలోచన నేనే...
ఐశ్వర్యము నేనే..
పరువు ,
ప్రతిష్ట..నేనే.....
పట్ట భద్రుడిగ గుర్తింపు
తెచ్చింది నేనే...
పామరుడిగా
తెలియ పరిచేది నేనే.....
ఇందరికి ఇన్నిటికి
మూలమైన
నన్ను మాత్రం
చులకన గానే ....
చూస్తాడు మనిషి.....
తూన లాడతాడు మనిషి....
నేనే ....కాగితాన్ని😉
మీ అందరి జీవితాల్లో
నలిగి కృశించిన కాగితాన్ని🙄
రేణుక సుసర్ల

20, ఏప్రిల్ 2017, గురువారం

నాకిష్టం

వెన్నెల రేయి లో మనసున్న నేస్తంతో మంచు చినుకుల్లో తడవడమంటే,
నాకిష్టం.

ఆరుబయట నులక మంచం పై వెల్లకిలా పడుకొని నక్షత్రాలను పలకరించడం అంటే,
నాకిష్టం.

వేసవి రాత్రులలో ఇంటి పెరడులో మల్లె పూల చెట్ల మీంచి గాలి వీస్తూ ఉంటే మత్తుగా కళ్ళు రెప్పలు వాలుస్తూ ఊహా లోకంలో విహరించడం, 
నాకిష్టం.

పచ్చని పొలాల గట్లు మీద  స్నేహితులతో కూర్చొని మొక్క జొన్న కండలు తింటూ ముచ్చటించడం అంటే, 
నా కిష్టం.

రాము మావయ్య తోటలో దొంగతనంగా మామిడి కాయలు కోసుకుని ఉప్పు, ఖారంతో తినడం అంటే,
నా కిష్టం.

ఇలా నా యద లోని భావలని మంచి ఫిల్టర్ కాఫీ తాగుతూ ఇష్టమైన వాళ్లతో ముచ్చటగా చెప్పుకోవడం నాకు మరి మరి ఇష్టం.

రేణుక సుసర్ల😁
http://bit.ly/2oRzefm

19, ఏప్రిల్ 2017, బుధవారం

నిట్టుర్పు

యాంత్రిక జీవితంలో,
బంధాల ఉచ్చులో కొట్టు మిట్టాడుతున్న నా జీవితపు నౌకలో చుక్కానివై నిలిచావు.
మనిద్దరం
జీవితంలో ఎదురుపడని వేగుచుక్కలమని తెలిసికూడా
ఆపలేను నీ తలపుల కెరటాలని
తప్పో, ఒప్పో, తెగింపో చెప్పలేని పరిస్థితి.
కానీ నీ ఆలోచనలతో నా మనసు ఒకొక్కమారు విషాద వలయంలో చిక్కుకున్న, ఇంకొకమారు మనసుకి ఊరట కలిగిస్తుంది.
ఇది విరహమా, విషాదమా లేక ఆవేదనో ఏమి తెలియని అయోమయ పరిస్థితి...
నా ప్రేమే నిజమైతే జీవితం మరొక్కమారు అవకాశం ఇస్తే
నా ఊసులు, ఊహలు నీకు తెలపాలని..నా చిన్న కోరిక..
వేచి చూద్దాం..అంత వరకు ఈ విరహాన్ని ఆస్వాదిద్దాం.
రేణుక సుసర్ల.

ఎంకి

మా గడసరి ఎంకి సొగసులు నాయుడు బావ ఊసులు ఎంత సెప్పిన తక్కువే ఓలమ్మో..

నాయుడు బావ నాగలి పట్టి దున్నుతా ఉంటే మా ఎంకి మనసులో గిలిగింతలవుతాయి
నాయుడు బావ నాట్లు నాటతు కొంటెగా సూస్తూ ఉంటే మా ఎంకి మనసులో గుబులవుద్ది.

ఎండకి సేరబడి నాయుడు బావ అలుపు తీరత ఉంటే ఎంకి అంబలి తినిపిస్తాది.
చీర కొంగుతో నాయుడు బావ మొగం తుడుస్తా  ముద్దోరిగి పోతది.

సందేకాడ నాయుడు బావ సంతలో కొనిచ్చిన రబ్బరు గాజులు, రంగు రైకలు చూసి కిసుక్కున నవ్విన 
మా ఎంకి కి సిగ్గుతో బుగ్గలు
ఎరుపఎక్కి " రావోయ్ మా ఇంటికి ఓ మావ"  అని పాడుతూ వయ్యారంగా ముందుకి ఎలత ఉంటే నాయుడు బావ గుండె లబుకు లబుకు మని జారుద్ది..

నాయుడు బావ మా ఎంకి జంట చిలక గోరింకల మల్లె సూస్తా ఉంటే మా అందరి మనసు పొంగిపోతాది.

రేణుక సుసర్ల
Artwork: Madhurasree

17, ఏప్రిల్ 2017, సోమవారం

బాల్యం పులకింతలు

మరపు రావు మరల రావు 
నా చిన్న నాటి రోజులు...

మా నాయనమ్మ తినిపించిన గోరుముద్దలు,
గుర్రాల మీద రాజుల కధలు..
మా నాన్నగారి పొలికేకలు, మా అమ్మ నన్ను అలక తీర్చే సన్నివేశాలు.
ఎదురింటి మావుసి రసగుల్లాలు, భజన ప్రసాదాలు అన్ని మధురానుభూతులు

శైలజ ఇంట్లో మందార పూల అందాలు
పద్దు పెరడు సంపెంగ పూల సువాసనలు, 
రమా వాకిట నీలం డిసెంబర్ పూల మధురిమలు.
రుక్మిణి ముంగిట కనకాంబరాల కోసం పడ్డ పాట్లు అన్ని ఇన్ని కావు.

భగ్గు ఇంట కాకి ఎంగిలి జామకాయ ముక్కల రుచులు,
వాసు ఇంట పనస పండు తొనల  ఘుమఘుమలు,
వసంత దొడ్లో సపోటా పళ్ళ కొరుకుళ్ళు అన్ని హాయి గొలిపే ఊసులు.

మరపు రావు మరల రావు నా చిన్న నాటి రోజులు.

లీల బాయిగారి ఇంజెనెక్షన్ల బెదిరింపులు
YRK రావు uncle టీకాల తడాకాలు
వాణి సామంత స్కతస్కోప్ వింతలు,

కొలచినత్త కసుర్లు,
భాస్కర మాస్టారి సొంటిపిక్కలు, పక్క ముసలి ఆయి పొలిబొబ్బలు అన్ని తీయని తలపులు.

వాసు పైన నా అజమాయిషీ
ప్రమి మీద పెత్తనం
బాచి గాడి మీద నా విసుర్లు అన్ని గుర్తే.

గిరిజ తో ఆడిన బొమ్మల పెళ్లిళ్లు
ప్రమి, ప్రసన్నలతో లక్కపిడత లాట 
బుజ్జి, కుమార్,లక్ష్మీ,శైలు, ఉషాలతో 
ఆడిన బాస్కెట్ బాల్, డీఫ్ ఆటలు అన్ని సుపరిచితమే.

పవన, నేనులెక్కలతో  పడ్డ కుస్తీలు
పరీక్షల ముందు పాఠాల పల్లవితో గావుకేకలు
కంబైన్డ్ స్టడీ పేరిట సొల్లు కబుర్లు
డౌబ్ట్ కోసం అని వెళ్లిన వాళ్ల ఇంట్లో settle ఐపోడాలు.. అన్ని చెప్పలేనన్ని జ్ఞ్యాపకాలు.

మరపు రావు మరల రావు న చిన్న నాటి రోజులు

భగ్గు ఇంట్లో గోడ దూకడాలు
పక్క ఆయి ఇంటి పైన ఎండబెట్టిన జంకోళి వడియాల దొంగతనాలు
రాథో గారి బంతి, చేమంతి పూలు చెప్పకుండా కోసుకెళ్లడం అన్ని మరపురాని ముచ్చట్లు.

పేరి రవి తో పేచీలు
ఏ. రవి చిలిపి పనులు
సుబ్బు బేల చూపులు
బాచి నంగిరి చూపులు అన్ని 
కళ్ళకు కట్టి నట్టు ఇంకా నా మనసున నాటుకు పోయాయి అంటే నమ్మండి.

ఎనెన్నో ఇంకెన్నో జ్ఞ్యాపకాలు ముడివేసుకు పోయాయి మనసున పెనవేసుకు పోయాయి
చెపుతూ ఉంటే మనసుకు అలుపే ఉండదు
ఈ నా చిన్ని గుండెకు ఆశ తీరదు..
అందరికి, అన్నిటికి ప్రియమైన మీదైన మీ చిన్న నాటి నేస్తం

రేణుక సుసర్ల

గుత్తి వంకాయ

నిగ నిగ లాడు నీ రూపం కనులారా వీక్షించ మనసుకి ఉత్సాహంబు
భోజన ప్రియులకు బహు ఇష్టంబు..
జింహ్వ చాపర్యులకు రాను తేపంబు
కూరగాయల ప్రపంచానికి చక్రవర్తివి
అందరి మనసు దోచుకున్న రారాజువి...
నీవే
మన తెలుగింటి ప్రజల ఇష్ట మైన గుత్తి వంకాయవి
గుత్తి వంకాయ కూరలేని భోజనంబు తగునే..
ఏ కార్యంబు జరిగిన ఏ ఊరు వెళ్లిన..
ఎవరు ఆధిత్యంబు ఇచ్చిన
గుత్తి వంకాయ కూర తోనే సత్కార్యము జేయురు.
వేడి వేడి అన్నములో గుత్తి వంకాయ కూర , కమ్మని నేయి కలప ఆహా ఏమి రుచియో కదా..
ఆ దినంబు ఎంత సుఖముగ గడుచునో కదా..
గుత్తి వంకాయ కూర రుచిని జూడలేని మానవుడు జన్మ ఏమి జన్మ..
గుత్తి వంకాయ కూర లేని కార్యంబు ఏమి కార్యంబు...
అందుకేగా ఎవరో మహానుభావుడన్నాడు
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి
భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాపతివైరి వంటి రాజును గలరే
రేణుక సుసర్ల

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రేమ మాల

నీ తలపుల వానలో తడిసి ముద్దైన
నా ఊహలు మురిపించే సమాయాన్న
నీ సొగసుల గాలం నను నీ దరికి చేర్చిన వేళ
నీ మనోహరమైన సుందర మోము
నా కనులకు స్ఫురింప
నీ విరహాపు గాలులు నను సోకినంతనే
నాలోని ప్రేమ జ్వాల పొంగి
నాలో అణువణువు ఒక ప్రేమనుభూతి కలుగ
నా భావలన్ని ఒకొక్కటిగా
అక్షర రూపం దాల్చ, అవి
నా ప్రేమకావ్య మాలగా నీకు సమర్పించనా
నా కుసుమ మాధుర్య వల్లి
నా ప్రియ సఖి..
రేణుక సుసర్ల

ఓ సైనికుడా

ఓ సైనికుడా
అడుగు అడుగు మాకోసం
ప్రతి క్షణం మాకోసం
కన్న ఊరు, కన్న వార్ని వదిలి వెళ్లే మాకోసం
ఓ సైనికుడా 
గుండు ఎదురు గుండె నిలిపే యోధుడా..
ప్రాణ మంటే భయంలేదు దేశమంటే ప్రేమరా
నీ దేశ భక్తి కి నా ప్రనామ్
నీ మనసు కి నా సలాం
నిన్ను కన్న ఈ దేశం గొప్పదిరా
పుడమి తల్లి రుణం నీవు తీర్చేర
అమ్మ భరత మాత ముద్దు బిడ్డ నీవెర
జై హింద్🇮🇳
రేణుక సుసర్ల

పెళ్లి చూపులు

మా కాలంలో ఆడపిల్లకు పద్దెనిమిది దాటితే చాలు ఇంట్లో బామ్మలు, అమ్మమ్మలు పెళ్లి గోల మొదలుపెడతారు..
అమ్మాయి కనపడడం పాపం ఒరే ఇంకా ఎన్నాళ్లురా త్వరగా దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే ఆ ముచ్చట కాస్త చూసి పైకి పోతాను అని బామ్మ, అమమ్మల ఎమోషనల్ black mail మొదలవుతాయి.
మేనారికాలు ఉంటే మరి చెప్పనక్కరలేదు..పాపం వరసకి బావ ఐన వాడు ఎవరు వచ్చిన ఒసే నీ మొగుడొచ్చాడే వెళ్లి కాఫీ ఇవ్వు అని వరసలు కలపడాలు తప్పనిసరి.
ఇవన్నీ తలుపు చాటున బాపు గారి బొమ్మలా నిల్చొని వింటున్న అమ్మాయిలు కూడా సిగ్గుల మొగ్గలై నేలని కాళ్ళతో రాస్తూ ముసి ముసి నవ్వులు నవ్వడం..అబ్బో ఆ రోజులే వేరండి..
పెళ్లిచూపుల తత్తంగం కూడా చిన్న పెళ్లిలా అయ్యేదండి..
అబ్బాయి తరఫు వాళ్ళు కనీసం ఒక పది మంది దాకా ఐనా వచ్చేవాళ్ళు..వచ్చే ముందే రెండు పక్కల వాళ్ళు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి మరీ పిల్లని చూడ్డనికి వచ్చేవారు.
పెళ్లి చూపుల్లో అమ్మాయి కళ గా ఉందా లేదా, కలుపుగోరు మనిషేన, వంట వార్పు వచ్చా అన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కనక.
ఆడ పెళ్లి వారు కూడా అలాగే అబ్బాయి మంచి, చెడు, చూసే పిల్ల నిచ్చేవారు.
ఆ కాలంలో priorities వేరు అనుకోండి...
కాలంతో పాటు అన్ని మారాయి సమానత్వం మంత్రంలో ఎనెన్నో వరసలు, పద్ధతులు స్వరం కలిపాయి.
పెళ్లిచూపులు ముఖచిత్రమే మారిపోయింది.
అమ్మాయి bank బాలన్స్, అబ్బాయి బాంక్ balance, annual package ఎంత multi-talented అవునా, కాదా.., వీటికీ ప్రాధాన్యత ఎక్కువ..
ఇప్పటి కాలం , అప్పటి కాలంలో పోలిస్తే మంచి చెడు రెండు ఉన్నాయి.
అప్పట్లో ఆడపిల్ల ఆలోచనలకు అంత విలువ ఇచ్చేవారు కాదనుకోండి.
ఏదైనా పెళ్లి అంటే రెండు ఊర్లు కాకపోయినా రెండు కుటుంబాల కలయిక..ఒకరికి ఒకరు మాట, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోడం అంతే కాని కట్న, కానుకలు కాకూడదు.
అలాగే ఈ కాలం పిల్లల్లో adjustment అంటే ఏదో ఆత్మాభిమానం పొగట్టుకున్నంత భాద పడిపోతారు..కావాల్సిన వాళ్ళ కోసం సర్దుకుపోడం అన్నది అవమానం కాదండోయ్ అది అభిమానమే..
ఇలా చెప్పుకుంటూ పోతే కాలం ఆగదు.. మనసు నిండదు కానీ..
చిన్న చిన్నవి సర్దుకొని పోవడం లోనే అర్థం, పరమార్థం..
పెళ్లి అంటే నూరు ఏళ్ల పంట కావాలి కానీ నాలుగు నెలల ముచ్చట కారాదండోయ్😊
అందుకే అన్నారు
marriages are made in Heaven అని..

12, ఏప్రిల్ 2017, బుధవారం

మోహం




నీ తలపు నా మదిని మాఘ మాసపు పొగ మంచులా అలుముకున్న వేళ
నీ ఉనికి వేసవిలో కురిసిన స్వాతి చినుకువలే కవ్వించిన వేళ
నా మనసు మధుమాసపు కోయిలవలె మవున రాగం ఆలపించిన వేళ
నీ నగుమోము గనినంతనే నా యద పురివిప్పిన నెమలివలె నాట్యమాడే ***

విరహం





నీ నుండి దూరమవుదా మనుకున్న కొద్ది నీ జ్ఞ్యాపకాల సుడి నీడై వెంటాడుతోంది
నీ రూపం చెరుపుదా మన్న కొద్ది
చెరగని ముద్రలా నిలిచిపోయింది
నీ కోసం నిరీక్షణ 
ఎడారిలో ఎండమావి అని తెలిసి కూడా నీ రాక కోసం ఆశగానే ఎదురు చూస్తున్న
నిను మనసారా ప్రేమించడం నా నేరమా
అని ఏమి తెలియని నా ఈ మనసు మూగగా రోదిస్తోంది

అందం

అందం

సోయగాలు ఒలకు నయనంబుల గూడ
కులుకు లొలుకు వయ్యారి హొయలు 
తాచు పాము తలపింపు కురుల తోడ నిను గాంచ
ఔరా రతి దేవిని గూడ మరిపింప జేయ 
ఏమి వన్నెయో కదా అని నా మోము నివ్వెర నొందె...

లోకం తీరు



ఏంటో వింత లోకం
చెప్పిందల్లా వింటే చేతకాని దద్దమ్మ అంటారు
పోనీ మన ఇష్టం వచ్చినట్లు చేస్తే వెధవకి వళ్ళు కొవ్వు అంటారు
పోనీ కొన్ని వాళ్ళకి నచ్చినట్టు కొన్ని మనకి నచ్చినట్టు చేసిన తప్పె అండి బాబు🙄
మొన్నటి వరకు అన్ని మనం చెప్పినట్లే వినేవాడు ఇప్పుడు మారిపోయాడు వామ్మో🤔కలియుగం తల్లీ అని ఆడిపోసుకుంటారు...అందుకే ఎవరి మాట వినకండి...మనసు చెప్పింది చెయ్యండి👌ఇంటికి వంటికి మంచిదండోయ్
రేణుక సుసర్ల

ఆలపన⁠⁠⁠⁠



నిండు జాబిలి దుప్పటిలా పరుచుకున్నవేళ..
మిణుకుమనే నక్షత్రాలు 
దొంగ చూపులు చూడగా
పిల్లగాలి తన చిలిపి చేష్టలతో 
మత్తెక్కిస్తూ ఉంటే
నా కొంటె చూపులు నీ నీడ కోసం వెతికాయి
పరిమళాలు వెదజల్లే పూరెమ్మలు
నీ రాక తెలుపగా నా కన్నులు
తన్మయత్వంతో మూతలు బడ్డాయి
పెదవిపై చిరు మందహాసం నాట్యమాడింది

మనిషి



కంటి ఎదురుగ దుర్మార్గం
మనిషి ఎదుట దౌర్జన్యం
మిన్నకుండు మనకెందుకు
ఇది మనిషి నైజం
గులుతోంది గుండె లోని అన్యాయపు సెగ
మండుతోంది మనసులోని ఆవేశపు జ్వాల
ఎరదురు తిరిగే ధైర్యమె లేదాయె
మనకెందుకు మనమెందుకు
ఇది మనిషి నైజం
అన్యాయం మనకి కాదు, ఆవేశం మనకెందుకు
స్వార్థం తో కళ్ళు కూడా మూసుపోయే గొంతు కూడా పెగలదాయే
మనకెందుకు, మనమెందుకు ఇది మనిషి నైజం
రేపు మనది కాదోయ్, కీడు మనకి కుడా జరుగవచ్చునోయ్
మనిషి మనిషి తోడుంటే ఒకరి ఒకరు బలమోయ్
నువ్వు స్వార్థ బుద్ధి మానవోయ్ మంచి మనిషిగ బతకవోయ్
మనకెందుకు మనమెందుకు ఇక ఆపవోయ్.

10, ఏప్రిల్ 2017, సోమవారం

డాలర్ మోజు

ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండు అంత సౌఖ్యం మరొకటి లేదంటే ఏమో అనుకున్న కానీ మన NRI ల తంటాలు చూసాక ఔరా ఇది నిజమే కదా అనక తప్పలేదు
ఎదో దీపం ఉన్నపుడే ఇల్లు సద్దుకుందాం అన్న ఆత్రం
నాలుగు డబ్బులు వెనక వేసుకుందాం అన్న ఆలోచనలతో
నానా కష్టాలు పడి కన్న వాళ్ళని, కట్టు కున్న భార్యని, కన్న బిడ్డల్ని సహితం విడిచి విదేశాలకు వెళ్తారు...
ఆత్మాభిమానం దెబ్బతిన్న
అందలం ఎక్కాలని పట్టించుకోరు
పాపంవెట్టి చాకిరి చేస్తారు
ప్రాణాలను సైతం పణంగా పెడతారు
చేతి నిండా డబ్బులున్న అనుభవించలేని స్థితి
ఐన వాళ్ళు ఉన్న అక్కున చేరలేని దుస్థితి
ఇవన్నీ కోరితెచ్చుకున్న కష్టాలు కావ
ఉన్న దాంట్లో సంతృప్తి పడలేమా
మనం పెరిగినట్లు మన పిల్లల్ని పెంచితే తప్పేంటి కష్టం సుఖం వాళ్ళకి తెలియ నివ్వాలి
అంతేకాని మనం పెరిగినట్లు వాళ్ళని పెంచకూడదు అనుకొని
కోరిన దల్లా తెచ్చి ఇవ్వాలన్న తాపత్రయంలో వచ్చిన పాట్లు ఇవన్నీ..
అందుకే అందిన ద్రాక్ష తియ్యన అందనివి పుల్లన అనుకుంటే ఇంటికి వంటికి మంచిది😊
రేణుక సుసర్ల

నీ నేస్తం

నీ నేస్తం

కాలం తో పాటు మారె ఋతువుతో నిన్ను పోల్చలేను
రేయి వచ్చి పొద్దు కనపడని చంద్రుడితోను పోల్చలేను
అవసరానికో రంగు మార్చే వినీలాకసంతోను పోల్చలేను
నిన్ను నిన్నుగా నా కంటే ఎక్కువ నమ్మే వ్యక్తిగా *** నీదైన నీ నేస్తం
రేణుక సుసర్ల

నిష్టురం

తీయ తీయ పలుకులు తీపిగా దిగునే
నిజము పలుకు వాళ్లకు నిష్టురములే ఎదురాయే
కష్ట మైన గాని కాఠిన్యము తెలప నిజము
తినగ తినగ తీపి కూడా విషమగునే
తెలిసి కూడ జనము మొగ్గు చూప 
నేనేమి సేదురా 👳
విశ్వధాభి రామ
వినవా ఓ రామ
🌞 రేణుక సుసర్ల

మంచే

ఎంకి నేసిన మంచె
ఎదలో ఊహాలన్ని మూట కట్టుకున్న మంచె
ఎన్నెన్నో ఊసులు దాచిన మంచె
ఎంకి మావకి సద్దికూడు
ఊసులు సెపుతూ 

ముద్దుగా తినిపించిన మంచె
ఎన్నో ఎన్నెల రాత్రులు మావతో జాగారం చేసిన మంచె
మనసైన మావ సరసన ఉంటే ఎంకి మంచె కూడా
పట్టు పానుపే నంట..

మనో నేత్రం

మనో నేత్రం
సంధ్య పుట్టుకతో అంధురాలు కాకపోయినా ఒకానొక సమయంలో విధి ఆడిన నాటకంలో కళ్ళు పోగొట్టుకొని ..ఒక Blind స్కూల్ లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది.
రవి కూడా అక్కడ దగ్గరగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు .
సంధ్య , రవి చేరవలసిన గమ్యం, ఎక్కవలసిన బస్ ఒకటే ఇద్దరి timings కూడా ఒకటే అవ్వడం వల్ల క్రమేపి మంచి స్నేహితులుగా మారి మంచి ప్రేమికులుగా కూడ అయ్యారు.
రోజు రవి తన పరిజ్ఞ్యానం తో లోకంలో జరిగేవి అన్ని సంధ్య కళ్ళకి కట్టినట్టు చెప్తు," సంధ్యా నా కళ్ళతో లోకం చూడు " అనే వాడు.
ఈ పదం సంధ్యలో బాగా నాటుకు పోయి ఎలాగైనా తనకి కళ్ళు వచ్చేటట్టు చెయ్యమని రోజు రవి ని వేడుకొనేది.
అసలే సంధ్య అంటే ప్రాణం మైన రవికి ఎలాగైనా సంధ్య కోరిక తీర్చ దల్చుకున్నాడు.
ఒక నాడు సంధ్యని తీసుకొని తనకి తెలిసిన కంటి డాక్టర్ కి చూపించి అన్ని మాట్లాడి ఆపరేషన్ కి date ఫిక్స్ చేసుకున్నాక ,సంధ్య మొహంలో ఒక కొత్త కాంతి రవి కి కనపడింది ఒకానొక సుముహూర్తాన సంధ్య operation successful ఐ సంధ్య కళ్ళకి చూపు రానే వచ్చింది.
రాగానే మొదటి సారి డాక్టర్ ని సంధ్య "సర్ నాకు ఈ భాగ్యం ప్రసాదించిన దేముడ్ని " నాకు ఒక మారు చూపించరు అని దీనంగా వేడుకుంది"..ఇంకో పక్క ఇంత చేసి రవి నాకు చూపు వచ్చే టైం కి నా పక్క లేకపోడం ఏంటి అన్న ప్రశ్న కూడా ఆమెని దొలిచేస్తోంది...
ఇంతలో డాక్టర్ గారు చిన్న letter ఇచ్చి ఇది మీకు రవి ఇమ్మాన్నారు అమ్మ అని అందించేరు..ఆ కాగితం చదివాక సంధ్య కళ్ల లోంచి కన్నీటి చుక్కలు అచేతనంగా కాగితం మీద పడ్డాయి..😔
ఇంతకీ ఆ కాగితం లో రవి ఏమి రాసాడు🤔
" సంధ్య నీ రేపటి ఉదయం నా కిరణాలతో మొదలవ్వాలి. ఎప్పుడు అనే వాడిని కదా సంధ్య నా కళ్లతో లోకం చూడు అని ఇప్పుడు అదే చెయ్యు సంధ్య"
నా కళ్లతో లోకన్ని చూడు😢
రేణుక సుసర్ల

5, ఏప్రిల్ 2017, బుధవారం

బామ్మ మడి

నా చిన్న నాటి జ్ఞ్యాపకాల పుటాల్లో ఒక చిన్న హాస్యపు పన్నా
మా నాయనమ్మ పూర్వకాలం మనిషి అవ్వడం వల్ల చాదస్తం, మడి కాస్త ఎక్కువే..ఐతే దాంట్లోని చాలా తెలివి చూపించేది శీతా కాలపు మడి వేసవి కాలపు మడి అని రెండు రకాలు ఉండేవి ఆవిడ డిక్షనరీ లో
శీతా కాలంలో తనని ముట్టుకున్న కూడా "భడవల్లారా
కొంచం ఉంటె తగిలేవారు ఇంకా నయం దూరంగ జరగండి" అని ఉరిమి తెలివిగా స్నానం ఎగ్గొట్టేది
అదే వేసవికాలం ఐతే మేము ముట్టుకోకపోయిన "వెధవల్లరా ఇలా మీద మీద పడి నా మడి మంట కలిపేసారు స్నానం చెయ్యాసిందే" అని మరో మారు తెలివిగా వేసవి తాపనికి స్నానం చేసి వచ్చేది...
ఔరా 🤔 వాళ్ళ తెలివితేటలు ముందు మన మెంత అనిపించేది.
రేణుక సుసర్ల

పల్లకి

అంగరంగ వైభవంగా
అత్తవారింట అడుగుపెట్టు తరుణమది...
తనదయిన నవ జీవితంలోకి 
ఆశగా అడుగుపెట్టు వధువుకు
జీవితపు వడి దుడుకులకు
తొలి మజిలీ నేనే అంటోందా పల్లకి!
పుట్టినింట పుత్తడిబొమ్మకి
మెట్టినింటికి దారి పరచి
కడ దాకా రాలేనన్న సంగతి మరచి
మురిపెంగా నేనున్నా అంటొంది ఆ పల్లకి!
కంటిపాపలా పెంచిన వారు
కంటి కొనలు దాటిపోతుంటే...
కనులెదట మనువాడినవాడుండగా
కంటికొలనులో కన్నీరెందుకే అంటోంది ఆ పల్లకి!
మది నిండా మమకారపు అలోచనలు సుడిగుండాలయి
యెద నిండా యేలుకునే వాడిపై యేకాగ్రత కుదరక
బరువెక్కిన హ్రుదయంతొ భారంగా కూర్చున్న వధువు
భారం కాసేపయినా మోయనివ్వమని ముందుకు కదిలిందా పల్లకి!!!
శుభోదయం

ఆడజన్మ

అతివను నేను అల్పురాలిని కాను..
నేనె అందమైన ఆడ జన్మను *స్త్రీని*
నీ జన్మకి కారకురాలిని నేనె 
నీకు "నేను" అన్న పదానికి అర్థం తెలిపింది నేనె
పుట్టినింటి వెలుగుని నేనె
అమ్మ నాన్నల ఆణి ముత్యం నేనె..అన్నల గారాల పట్టి, తమ్ముళ్ల ఆత్మాభిమానం నేనె
ఒక ఇంటి ఇల్లాలిగా నీ జీవితం ఒడిదుకులలో భాగస్వామి ఐ సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దింది నేనె
కమ్మనైన అమ్మగా లాలించింది,జోలపాడింది నేనె
కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది నేనె
పర్వతారోహణలో, అంతరిక్షంలో వైజ్ఞ్యానిక రంగంలో నైన ముందడుగు వేసింది నేనె
చట్ట సభల్లో నైన, రాజకీయాల్లో నైన, క్రీడా రంగమైన విజయం వరించింది నేనె..
స్త్రీ లేని ప్రపంచం ఒక అంధకారం అరణ్యం
స్త్రీ లేని జగత్తు ఊహించుకోగలమ..
స్త్రీ లేని ప్రపంచంలో మన ఉనికినే కోల్పోతాం
" కీర్తి శ్రీ ర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా.
యోగం. 34 శ్లోకం.
స్త్రీ ల లో కీర్తి సంపద వాక్కు స్మృతిజ్ఞానము ధారణా శక్తి కల బుద్ధి 
ధైర్యము ఓర్పు అనే ఈ ఏడూ గుణాలు నేనె "
యావత్ స్త్రీ జాతికి సగర్వంగా
నా నమస్సుమాంజలి.
రేణుక సుసర్ల

పరవశం

పండు వెన్నెల తోడు ఉండగా 
పచ్చిక బయళ్ళు నేస్తాలు కాగా
మిణుకు మనే నక్షత్రాలు 
నాకు స్వాగతం తెలుపగా..
కొబ్బరి చెట్టు ఆకుల్లో దోబూచులాడిన 
నీ మోము గాంచ నా బుగ్గలు సిగ్గుల మొగ్గలై ఎరుపెక్కే...
నీ అడుగుల సవ్వడి నా దరి చేరుతున్న తరుణంలో నా గుండె లయ తప్పిన 
వీణ వలే పదే పదే ఆలపించే ..
నీ చేయి నా చేతిని మృదువుగా స్పర్శించినంతనే పరవశముతో 
నన్ను నేనే మైమరచి
ప్రణయలోకము నందు 
విహరించే ఓ నా ప్రియా..
రేణుక సుసర్ల

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...