20, ఏప్రిల్ 2017, గురువారం

నాకిష్టం

వెన్నెల రేయి లో మనసున్న నేస్తంతో మంచు చినుకుల్లో తడవడమంటే,
నాకిష్టం.

ఆరుబయట నులక మంచం పై వెల్లకిలా పడుకొని నక్షత్రాలను పలకరించడం అంటే,
నాకిష్టం.

వేసవి రాత్రులలో ఇంటి పెరడులో మల్లె పూల చెట్ల మీంచి గాలి వీస్తూ ఉంటే మత్తుగా కళ్ళు రెప్పలు వాలుస్తూ ఊహా లోకంలో విహరించడం, 
నాకిష్టం.

పచ్చని పొలాల గట్లు మీద  స్నేహితులతో కూర్చొని మొక్క జొన్న కండలు తింటూ ముచ్చటించడం అంటే, 
నా కిష్టం.

రాము మావయ్య తోటలో దొంగతనంగా మామిడి కాయలు కోసుకుని ఉప్పు, ఖారంతో తినడం అంటే,
నా కిష్టం.

ఇలా నా యద లోని భావలని మంచి ఫిల్టర్ కాఫీ తాగుతూ ఇష్టమైన వాళ్లతో ముచ్చటగా చెప్పుకోవడం నాకు మరి మరి ఇష్టం.

రేణుక సుసర్ల😁
http://bit.ly/2oRzefm

1 కామెంట్‌:



  1. ఇష్టమే , కానీ ఎంత కష్టమో తెలుసా చెల్లీ -- పిచ్చ్చి తల్లీ
    -------------------------------------------------------------------
    ఎల్ ఈ డీ బల్బుల కాంతి అలవాటయ్ - వెన్నెల ప్రసరించటం మరచింది
    నేస్తాలందరు వున్నా - మనసుందో ,లేదో ఎలా చెప్పటం
    మంచు చినుకుల్లో తడిస్తే మనస్సు తేలికైతే - న్యూమోనియా చేసి హాస్పిటల్ బిల్లు బరువవుతుంది

    ఆరుబయట పడుకుంటే -- అరతులం బంగారం మాయం
    నులకమంచం అంటే ఏమిటని మా అమ్మాయి ఆరా ?
    నక్షత్రాలను లెక్కిద్దామంటే -- అదేదో పాడు ఉల్క ఇపుడే ఊడి పడాలా

    కాంక్రీట్ నగరాల్లో భవంతులే కానీ "పెరడు" వదలడు పాడు బిల్డరు
    మల్లె తీగ జాడ మరచి పుష్కరం దాటింది - కొందామంటే మూర ముప్పయి
    మల్లెల మత్తుతో కాదు వేసవి చెమటల వాసనతో మూర్ఛ వచ్చినట్లుంది
    నగరంలో బతుకు ఎప్పటికీ సగటు మనిషికి ఊహే మరి

    పొలాల పచ్చ్చదనాలు కల్తీ ఎరువుల కాలకూటాలతో ఎండి ఏడుస్తున్నాయి
    పొలం గట్ల మీది పల్లేరుకాయలు గుచ్చుకోగలవు జాగ్రత్త్త -
    అమెరికా తీపి మొక్కపోత్థు మన నాటు కంకి కుత్తుకే కొరికింది

    తోటలోని మామిడి కాయలకు కాల్లోచ్చ్చాయి - లారీల్లో ఎక్కి పట్నానికొచ్చ్చాయి
    కాయ కొనాలంటే కావాలి గుండె ధైర్యం - కారం పొడి కల్తీ అని మొన్నే పేపర్లో వచ్చింది
    మన రాము మావయ్య పట్నం లో ఎక్కడో పనికి కుదిరాడట

    పరుగుల లోకమే తప్ప , ఎదలోని భావాలు పంచుకోడానికి ఎవ్వరున్నారిప్పుడు
    ఫిల్టర్ కాఫీ గతమయిందిప్పుడు -ఇన్స్టెంట్ జీవితం నిజమయిందిప్పుడు
    ఇష్టమయిన వాళ్ళందరూ ఇప్పుడు అమెరికాలో లేదా మరెక్కడో మనకు దూరంగా
    కష్టం ,సుఖం పంచుకోడానికి ఇంటికిద్దరై మిగిలారిప్పుడు .

    ఊహలెప్పుడూ తీపి, నిజాలు భరించటం కష్టం --
    బతుకు బండి కుంటుతూ అయినా లాగడమే - మనకున్న ఏకైక లక్ష్యం ..

    రిప్లయితొలగించండి

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...