14, ఏప్రిల్ 2017, శుక్రవారం

పెళ్లి చూపులు

మా కాలంలో ఆడపిల్లకు పద్దెనిమిది దాటితే చాలు ఇంట్లో బామ్మలు, అమ్మమ్మలు పెళ్లి గోల మొదలుపెడతారు..
అమ్మాయి కనపడడం పాపం ఒరే ఇంకా ఎన్నాళ్లురా త్వరగా దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే ఆ ముచ్చట కాస్త చూసి పైకి పోతాను అని బామ్మ, అమమ్మల ఎమోషనల్ black mail మొదలవుతాయి.
మేనారికాలు ఉంటే మరి చెప్పనక్కరలేదు..పాపం వరసకి బావ ఐన వాడు ఎవరు వచ్చిన ఒసే నీ మొగుడొచ్చాడే వెళ్లి కాఫీ ఇవ్వు అని వరసలు కలపడాలు తప్పనిసరి.
ఇవన్నీ తలుపు చాటున బాపు గారి బొమ్మలా నిల్చొని వింటున్న అమ్మాయిలు కూడా సిగ్గుల మొగ్గలై నేలని కాళ్ళతో రాస్తూ ముసి ముసి నవ్వులు నవ్వడం..అబ్బో ఆ రోజులే వేరండి..
పెళ్లిచూపుల తత్తంగం కూడా చిన్న పెళ్లిలా అయ్యేదండి..
అబ్బాయి తరఫు వాళ్ళు కనీసం ఒక పది మంది దాకా ఐనా వచ్చేవాళ్ళు..వచ్చే ముందే రెండు పక్కల వాళ్ళు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి మరీ పిల్లని చూడ్డనికి వచ్చేవారు.
పెళ్లి చూపుల్లో అమ్మాయి కళ గా ఉందా లేదా, కలుపుగోరు మనిషేన, వంట వార్పు వచ్చా అన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కనక.
ఆడ పెళ్లి వారు కూడా అలాగే అబ్బాయి మంచి, చెడు, చూసే పిల్ల నిచ్చేవారు.
ఆ కాలంలో priorities వేరు అనుకోండి...
కాలంతో పాటు అన్ని మారాయి సమానత్వం మంత్రంలో ఎనెన్నో వరసలు, పద్ధతులు స్వరం కలిపాయి.
పెళ్లిచూపులు ముఖచిత్రమే మారిపోయింది.
అమ్మాయి bank బాలన్స్, అబ్బాయి బాంక్ balance, annual package ఎంత multi-talented అవునా, కాదా.., వీటికీ ప్రాధాన్యత ఎక్కువ..
ఇప్పటి కాలం , అప్పటి కాలంలో పోలిస్తే మంచి చెడు రెండు ఉన్నాయి.
అప్పట్లో ఆడపిల్ల ఆలోచనలకు అంత విలువ ఇచ్చేవారు కాదనుకోండి.
ఏదైనా పెళ్లి అంటే రెండు ఊర్లు కాకపోయినా రెండు కుటుంబాల కలయిక..ఒకరికి ఒకరు మాట, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోడం అంతే కాని కట్న, కానుకలు కాకూడదు.
అలాగే ఈ కాలం పిల్లల్లో adjustment అంటే ఏదో ఆత్మాభిమానం పొగట్టుకున్నంత భాద పడిపోతారు..కావాల్సిన వాళ్ళ కోసం సర్దుకుపోడం అన్నది అవమానం కాదండోయ్ అది అభిమానమే..
ఇలా చెప్పుకుంటూ పోతే కాలం ఆగదు.. మనసు నిండదు కానీ..
చిన్న చిన్నవి సర్దుకొని పోవడం లోనే అర్థం, పరమార్థం..
పెళ్లి అంటే నూరు ఏళ్ల పంట కావాలి కానీ నాలుగు నెలల ముచ్చట కారాదండోయ్😊
అందుకే అన్నారు
marriages are made in Heaven అని..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...