30, మార్చి 2017, గురువారం

ఎండ మావులు


ఎండ మావులు

ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండు అంత సౌఖ్యం మరొకటి లేదంటే ఏమో అనుకున్న కానీ మన NRI ల తంటాలు చూసాక ఔరా ఇది నిజమే కదా అనక తప్పలేదు
ఎదో దీపం ఉన్నపుడే ఇల్లు సద్దుకుందాం అన్న ఆత్రం
నాలుగు డబ్బులు వెనక వేసుకుందాం అన్న ఆలోచనలతో
నానా కష్టాలు పడి కన్న వాళ్ళని, కట్టు కున్న భార్యని, కన్న బిడ్డల్ని సహితం విడిచి విదేశాలకు వెళ్తారు...
ఆత్మాభిమానం దెబ్బతిన్న
అందలం ఎక్కాలని పట్టించుకోరు
పాపంవెట్టి చాకిరి చేస్తారు
ప్రాణాలను సైతం పణంగా పెడతారు
చేతి నిండా డబ్బులున్న అనుభవించలేని స్థితి
ఐన వాళ్ళు ఉన్న అక్కున చేరలేని దుస్థితి
ఇవన్నీ కోరితెచ్చుకున్న కష్టాలు కావ
ఉన్న దాంట్లో సంతృప్తి పడలేమా
మనం పెరిగినట్లు మన పిల్లల్ని పెంచితే తప్పేంటి కష్టం సుఖం వాళ్ళకి తెలియ నివ్వాలి
అంతేకాని మనం పెరిగినట్లు వాళ్ళని పెంచకూడదు అనుకొని
కోరిన దల్లా తెచ్చి ఇవ్వాలన్న తాపత్రయంలో వచ్చిన పాట్లు ఇవన్నీ..
అందుకే అందిన ద్రాక్ష తియ్యన అందనివి పుల్లన అనుకుంటే ఇంటికి వంటికి మంచిది😊
రేణుక సుసర్ల

అభిమానం

                        అభిమానం

అదొక చిన్న పల్లెటూరు..
దాంట్లో ఒక చిన్న పెంకుటిల్లు ఎదురుగ ఒక వేప చెట్టు ఉండేది..ఆ ఇంట్లో వాళ్ళు ,వచ్చే పోయే జనం పాపం దాన్ని తిట్టుకోని రోజంటు లేదంటే నమ్మండి..
ముదనష్టపు చెట్ట్టు రోజు ఆకురాలి ఛస్తోంది.. ఊడవలేక సస్తున్న అని ఆ ఇంటి ఇల్లాలు..వెధవ కాకి గోల దిక్కుమాలిన చెట్టుని నరికిస్తే పోలా అని ఆ యజమాని పాపం రోజు ఆ వేపచెట్టు ని ఆడిపోసుకునే వారు, ఆఖరికి
చెట్టు ఆకు గాలికి రాలిన , చెట్టు మీద పిట్టలు రెట్టలు వేసిన చెట్టుదే తప్పనట్టు తిట్టేవారు .
పాపం ఆ వేపచెట్టు నేను బతికుండగా ఈ జనం నన్ను ప్రేమగా చూడకపోతారా అని ఎదురుచూడం తోనే దాని జీవితం కాలం చెల్లింది..
ఒకానొక పెను తుఫానుకి ఆ చెట్టు వేళ్ళతో సహా నేల కొరిగింది..
అప్పుడు తెలిసిందండి ఆ ఇంటివాళ్ళకి , వచ్చే పోయే జనానికి దాని విలువ..ఇన్నాళ్లు ఆ వేప చెట్టు ఎండకి, వానకి ఎలా కాపాడింది ..
సేద తీరాడానికి వచ్చిన వాళ్ళకి కబుర్లు, కాలక్షేపం అన్ని ఇక లేకుండా పోయాయి.
ఏదైనా ఉన్నంతవరకు విలువ తెలీదు అలాగే మన నిత్య జీవితంలో అభిమాన పడ్డవారు తారసపడినపుడు నిర్లక్ష్యం చూపించకండి . మనకి కావాల్సినవుడు వాళ్ళు రావాలి
లేదంటే పోవాలి అంటే లెక్కసరిపోదు..మనం మనుషులం అండి వేపచెట్టు కాదు సుమండీ😉😉

28, మార్చి 2017, మంగళవారం

అమ్మాయి ఆరాటం అత్తగారి ఉబలాటం

అమ్మాయి ఆరాటం అత్తగారి ఉబలాటం

అప్పుడే పెళ్లై మొదట పండక్కి పుట్టింటికి వచ్చిన అమ్మాయి ఆరాటం అత్తారింటి పట్ల ఇంత అంత కాదండోయ్. పాపం మనసులో ఒక పక్క అమ్మని కష్ట పెడ్తున్నాను అనే బాధ ఇంకోపక్క అత్త వారి మెప్పు పొందాలన్న తపన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి...
ఇహ పండుగ రోజు నాడు అమ్మాయి హడావిడి చూడండి...
అమ్మ మా ఆయనకి పెరుగు గారెలు, బొబ్బట్లు చాలా ఇష్టమే కానీ కష్ట పడకే అమ్మ...
ఏమి వద్దు ఈ రెండు చేసి సింపుల్ గ వంకాయ పచ్ఛికారం, చేమ దుంపల వేపుడు మజ్జిగపులుసు పెడితే చాలమ్మ ఎక్కువ కష్టపడకే అమ్మ...
ఎటు వడియాలు, అప్పడాలు వేయిస్తావుగా... కొద్దిగా చింతకాయ పచ్చడి, నంచుకి పచ్చడి ముక్కలు ఉంటాయిగా...
అమ్మ ఎక్కువ అలిసిపోకే సింపుల్ గ చెయ్యి ఇవన్నీ చాలు...వాళ్ళు సర్దుకునే మనుషులే...
పాపం వెర్రి పిల్లకి నేనంటె ఎంత ప్రేమో అని పాపం ఆ పిచ్చి తల్లి పొంగిపోయింది నేను కష్ట పడితే అస్సలు చూడలేదు😢
ఇవే నేను చేయమంటే అని ఆలోచనలో పడ్డాడు ఆ వెర్రి బ్రాహ్మడు🤔🤔😁
రేణుక సుసర్ల

స్నేహం

నిస్పృహ అనేదే ఉండదు నీ సాంగత్యంలో
అలుపే ఉండదు నీ సాన్నిహిత్యంలో
ఓటమే వెనుతిరుగుతుంది నువ్వు నా వెంట ఉంటే
మనసుకి సాంత్వన చేకూరుతుంది నీ మాటలతో
నీ స్నేహ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్న గడ్డిపరకను నేను మిత్రమా
రేణుక సుసర్ల

మనసు వ్యధ..

మనసు వ్యధ..
చెప్పుకోలేను బాధ నుండి తప్పుకోలేను
ఐన వాళ్ళు అవమానపరిస్తే అభిమానం అనుకున్న..
అవసరానికి ప్రతి ఒకళ్ళు నా తలుపు తడితే వాళ్ళకి నేనె లోకం అనుకున్న
ఆలోచించ కుండా అడిగినదల్లా చేస్తే వాళ్ళకి ఆపేక్ష పెరుగుతుంది అనుకున్న
చీటికీ మాటికి చీదరించుకుంటు ఉంటె వాళ్ళకి నా మీద మమకారం అనుకున్న
కానీ చివరికి నా ప్రేమ వాళ్లకి నా చేతకాని తనం..అని తెలిసిన నాడు మనసు ముక్కలైంది గుండె ఆగిపోయింది
ఏడవడానికి కంట్లో నీళ్లు కూడా కరువయ్యాయి...
నా మనసు కూడా నన్ను దీనంగా వేడుకుంది మళ్ళా ఇదే తప్పు మాటిమాటికి చెయ్యొద్దని😢
రేణుక సుసర్ల

27, మార్చి 2017, సోమవారం

సొగసు చూడ తరమా

రవి వర్మ చేతిలో కుంచెవా
లేక బాపు చిత్రానివా
అజంతా శిల్పానివా
హొయలు ఒలికే పాలరాతి బొమ్మవా
చందమామ కూడా ఈర్ష వచ్చే అందానివా
ఎవరివి నీవెవరివి
ఓ నా ప్రియ సఖీ
నీ సొగసు చూడతరమా

రేణుక సుసర్ల

రైతన్న కష్టాలు

రైతన్న కష్టాలు
హలం పట్టి పొలం దున్ని
పంట చేతికిచ్చి నోడి
పగలనక, రేయనక
కాయ కష్టం చేసినోడి
కూడు, గుడ్డ కరువాయే.
ఎండనక, వాననక
చినుకు చినుకు కూడగట్టి
ఆకలి మంట తీర్చినోడి
బ్రతుకు మంట కాలిపోయె.
ప్రకృతివింత, వడ్డీలమోత,
మార్చాయి రైతన్న తలరాత...
బరువెక్కిన గుండెతో
ఆగలేని బాధతో
నేలకొరిగె
పుడమి తల్లి ముద్దు బిడ్డ
రేణుక సుసర్ల

26, మార్చి 2017, ఆదివారం

జ్ఞ్యాపకాల సుడి

జ్ఞ్యాపకాల సుడి
నీ నుండి దూరమవుదా మనుకున్న కొద్ది నీ జ్ఞ్యాపకాల సుడి నీడై వెంటాడుతోంది
నీ రూపం చెరుపుదా మన్న కొద్ది
చెరగని ముద్రలా నిలిచిపోయింది
నీ కోసం నిరీక్షణ 
ఎడారిలో ఎండమావి అని తెలిసి కూడా నీ రాక కోసం ఆశగానే ఎదురు చూస్తున్న
నిను మనసారా ప్రేమించడం నా నేరమా
అని ఏమి తెలియని నా ఈ మనసు మూగగా రోదిస్తోంది
రేణుక సుసర్ల

ఏంటో వింత లోకం

ఏంటో వింత లోకం
చెప్పిందల్లా వింటే చేతకాని దద్దమ్మ అంటారు
పోనీ మన ఇష్టం వచ్చినట్లు చేస్తే వెధవకి వళ్ళు కొవ్వు అంటారు
పోనీ కొన్ని వాళ్ళకి నచ్చినట్టు కొన్ని మనకి నచ్చినట్టు చేసిన తప్పె అండి బాబు🙄
మొన్నటి వరకు అన్ని మనం చెప్పినట్లే వినేవాడు ఇప్పుడు మారిపోయాడు వామ్మో🤔కలియుగం తల్లీ అని ఆడిపోసుకుంటారు...అందుకే ఎవరి మాట వినకండి...మనసు చెప్పింది చెయ్యండి👌ఇంటికి వంటికి మంచిదండోయ్
రేణుక సుసర్ల

25, మార్చి 2017, శనివారం

నీ రాక కోసం


నీ రాక కోసం


నిండు జాబిలి దుప్పటిలా పరుచుకున్నవేళ..
మిణుకుమనే నక్షత్రాలు 
దొంగ చూపులు చూడగా
పిల్లగాలి తన చిలిపి చేష్టలతో 
మత్తెక్కిస్తూ ఉంటే
నా కొంటె చూపులు నీ నీడ కోసం వెతికాయి
పరిమళాలు వెదజల్లే పూరెమ్మలు
నీ రాక తెలుపగా నా కన్నులు
తన్మయత్వంతో మూతలు బడ్డాయి
పెదవిపై చిరు మందహాసం నాట్యమాడింది


ఓ నానేస్తమా

ఓ నానేస్తమా


మండుటెండలో కురిసే వేసవి జల్లువవా, 
వెన్నెలంతా హాయి గొలిపే మంచు ముత్యానివా 
లేక నింగిని తాకే చల్లని మేఘానివా 
తొలి పొద్దు ఆలపించే భూపాల రాగానివా
లేక సంధ్యా సమాయన్న కనిపించే సింధూర కెరటానివా...
ఎవరివో నీవెవరివో 
మధుమాసం లో పాడే కోయిల రాగానివా
లేక  నన్ను నన్నుగా చూసే నా ప్రియ నేస్తానివా

రేణుక

24, మార్చి 2017, శుక్రవారం

జనం జనం భయం


                        జనం జనం భయం

జనం జనం భయం భయం
ఏది నిజం, ఏది కల్ల
ఎవరు మంచి,ఎవరు చెడ్డ
నిన్న అభినందన ఊపు
నేడు తిరస్కారపు చూపు 
జనం జనం భయం భయం
అందలం ఎక్కిస్తారు అగాధంలోకి నెడతారు
ముద్దొస్తే పూల పానుపు లేదంటే ముళ్ల పానుపు
జనం జనం భయం భయం
వెన్ను తట్టి లేపినోళ్లే వెన్నుపోటు పొడుస్తారు
దేవతని అన్నవాళ్లే దెయ్యంలా చూస్తారు
అయోమయం నీడలో అనుమానపు కోరల్లో
ప్రతి క్షణం భయం భయం
రేణుక సుసర్ల

23, మార్చి 2017, గురువారం

మనిషి నైజం

మనిషి నైజం
కాలంతో పాటు అన్ని మారాయి మనిషి మారాడు,
మమతలు మారాయి, 
విలువలు మారాయి.
స్వార్థం కళ్ళు మూసింది
అహంకారం చెవులు మూసింది
నా అనే పదం నోరు మూసింది.
ఆత్మాభిమానం ఉన్నవాడికి నిలువ నీడ కూడా లేదాయె... తప్పు అని వేలెత్తి
చూపించిన వాడు దుర్మార్గుడు
ఖండిస్తే కసాయివాడు
ప్రోత్సహిస్తే హితుడు,
సన్నిహితుడు.
మనిషి  జీవితంలో మానవతా విలువలకి చోటే లేదాయె
ఒంటరిగా పోరాడలేను...
గుంపులో గోవిందంలాగ ఉండనులేను😏
మంచికి రోజులే లేవా🤔

మౌనం



మౌనం


క్షణాలు యుగాలుగా గడిచే నీ నిరీక్షణలో
కళ్లకే ఊసులొస్తే
మనసుకే మాటలొస్తే 
మవునమే గీతమైతే 
ఊహాలే నిజం ఐతే 
ఆశలే తీరేనా అలుపే ఆగేనా నా తపస్సే ఫలించేనా ఓ నా నేస్తమా


22, మార్చి 2017, బుధవారం

ఆశ



ఆశ

నీ ఆనందం ఎక్కడ ౼
నా చెలి కళ్లల్లో .
నీ ప్రేమ ఎంత ౼
నింగిని తాకినంత.
నీ శ్వాస ఎక్కడ
నా చెలి  కౌగిలిలో.
నీ పయనం ఎటువైపు౼
నా చెలి ఉన్నచోటు.
నీ జీవితం ఎక్కడ౼
నా చెలి హృదయం చెంత.
పండు వెన్నెల పెళ్లి పందిరి కాగ
మిణుకుమనె నక్షత్రాలు తలంబ్రాలుగా సప్తఋషులు సాక్షులు కాగా నా నిన్నటి ఊహ నేటి నిజం కావాలి ఓ నా ప్రియా☺  
రేణుక సుసర్ల

నిస్పృహ



నిస్పృహ

గుండెలో నీ జ్ఞ్యాపకాల్ని శిథిలం చేసిన నాడే శవమయ్యా
నువ్వు చేసిన అవమానాలన్ని నవ్వుతూ భరించిన నాడే 
జీవచ్ఛంలా బ్రతికాను
నువ్వు చేసిన వాగ్దానాలు, ఆడిన మాటలు అభద్ద మని తెలిసిన నాడే ప్రాణమున్న బొమ్మ నయ్యాను 
ఐనా ముఖానికిి నవ్వు ముసుగు వేసి మనసులో బాధ అనే గాయాన్ని పూడ్చి బ్రతుకుతున్న శవంలా మిగిలాను..
చివరికి నా మనసు నన్ను అడిగింది నీ ప్రేమకి అర్హత లేని వాడి కోసం ఎందుకు నీకీ తపన...🤔

21, మార్చి 2017, మంగళవారం

మరణ శాసనం

 మరణ శాసనం

పక్షి ఎగిరేది ఎంత వరకు
రెక్కలు ఉన్నంతవరకు
మనిషి మనుగడ ఎంతవరకు ఆత్మాభిమానం ఉన్నంతవరకు
శ్వాస నిలిచేది ఎంతవరకు ఊపిరి ఉన్నంతవరకు
ఆకారం నిలిచేది ఎంతవరకు కట్టె కాలేవరకు
మనిషిగా పుట్టడం తేలిక కానీ మనిషిగా బ్రతకడం కష్టం
నాలుగు రోజుల అథితులం నవ్వుతూ నవ్విస్తూ బతికేద్దాం                      
 రేణుక సుసర్ల

ఓ మనిషి నీ ఉనికి ఎక్కడ

ఓ మనిషి నీ ఉనికి ఎక్కడ

అల్పుడి మీద దౌర్జన్యం, ఆడ దాని మీద అత్యాచారం,పేద వాడి మీద పెత్తనం..ఎటు పోతోంది ఏమవుతోంది మనసున్న మనిషే లేడా
ఓ మనిషి నీ ఉనికి ఎక్కడ
పుట్టడానికి డబ్బు,చదువుకుంటే డబ్బు,ఉద్యోగంకావాలన్నా డబ్బు డబ్బు డబ్బు
మనుషుల్లో మార్పే రాదా
ఓ మనిషి నీ ఉనికి ఎక్కడ
పెళ్లి ముసుగులో కట్నపు దాహం
ప్రభుత్వ కుర్చీలో లంచం మోహం , ధర్మం పేరిట గురువుల ముందర జనం దాసోహం
అంత రిక్షంలో ఉపగ్రహాల్ని పంపే యుగంలో కూడా తన క్షేమంకోసం గ్రహాలచుట్టూ తిరుగుతాడు
వైజ్ఞ్యానం పెరిగిన మనిషి విజ్ఞ్యానం పెరగలేదు తరాలు మారినా మనిషి ఆలోచన తీరు మార లేదు...వీళ్ళు మారరా మార్చలేమా అన్ని జవాబు లేని ప్రశ్నలేన
ఓ మనిషి నీ ఉనికి ఎక్కడ

రేణుక సుసర్ల

అందమా నీ పేరేమిటి



                        అందమా నీ పేరేమిటి 

సోయగాలు ఒలకు నయనంబుల గూడ
కులుకు లొలుకు వయ్యారి హొయలు
తాచు పాము తలపింపు కురుల తోడ నిను గాంచ
ఔరా రతి దేవిని గూడ మరిపింప జేయ
ఏమి వన్నెయో కదా అని నా మోము నివ్వెర నొందె...
రేణుక సుసర్ల. 

అలనాటి జ్ఞ్యాపకాలు

అలనాటి జ్ఞ్యాపకాలు

నా చిన్నప్పుడు మా కుటుంబం కూడా శంకరా భరణం శంకర శాస్త్రి గారికి ఏమి
తీసిపోదండోయ్

మా నాయనమ్మ గారికి విపరీతమైన మడి, ఆచారం నిజంగా నిప్పులు కడిగే వారంటే నమ్మండి.
రోజు మడి బట్ట కట్టుకుని వంట చేస్తే కానీ ఆవిడకి తృప్తి ఉండేది కాదు.ఎంత మడి, ఆచారం ఐనా భోజనం వేళలో ఎవరు వచ్చిన తినకుండా వెళితే ఒప్పుకునే వారు కాదండోయ్ ఆ కాలంలో ఆప్యాయతలే వేరు
అప్పట్లో చిరుతిళ్ళు అంటే ఎంచక్కా ఎర్రగా కాల్చిన దిబ్బ రొట్టి, కొయ్య రొట్టి,చల్లరొట్టి, చైగోనీలు ఇవేనండి..అబ్బో ఆ రుచులే వేరు.
తీరిక వేళల్లో మా నాయనమ్మ గారు చెప్పిన రామాయణం, మహాభారతం కథలు, రాజుల సహస కథలు ఇప్పటికి చెవిలో గింగిర్లు ఆడతాయంటే నమ్మండి.
ఇప్పటి కాలంలో ఉండే సౌఖ్యాలు లేకపోయినా ఎంతో హాయిగా, ఆనందంగా ఉండేవాళ్ళం..కానీ ఈ తరం వాళ్ళని చూస్తె జాలిపడడం తప్ప ఏమి చేయలేము వాళ్ళకి పాపం దేనికి సమయం ఉండదు ఇక ఇవన్నీ ఎప్పుడు ఆస్వాదిస్తారు.
బహుస మనతరంలో

ప్రాధాన్యతలు వేరు. అప్పట్లో కాలం మన చేతిలో ఉండేది ఇప్పుడు కాలం చేతిలో మనం కీలుబొమ్మలయ్యాం🙂

*రేణుక సుసర్ల*

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...