19, ఏప్రిల్ 2017, బుధవారం

ఎంకి

మా గడసరి ఎంకి సొగసులు నాయుడు బావ ఊసులు ఎంత సెప్పిన తక్కువే ఓలమ్మో..

నాయుడు బావ నాగలి పట్టి దున్నుతా ఉంటే మా ఎంకి మనసులో గిలిగింతలవుతాయి
నాయుడు బావ నాట్లు నాటతు కొంటెగా సూస్తూ ఉంటే మా ఎంకి మనసులో గుబులవుద్ది.

ఎండకి సేరబడి నాయుడు బావ అలుపు తీరత ఉంటే ఎంకి అంబలి తినిపిస్తాది.
చీర కొంగుతో నాయుడు బావ మొగం తుడుస్తా  ముద్దోరిగి పోతది.

సందేకాడ నాయుడు బావ సంతలో కొనిచ్చిన రబ్బరు గాజులు, రంగు రైకలు చూసి కిసుక్కున నవ్విన 
మా ఎంకి కి సిగ్గుతో బుగ్గలు
ఎరుపఎక్కి " రావోయ్ మా ఇంటికి ఓ మావ"  అని పాడుతూ వయ్యారంగా ముందుకి ఎలత ఉంటే నాయుడు బావ గుండె లబుకు లబుకు మని జారుద్ది..

నాయుడు బావ మా ఎంకి జంట చిలక గోరింకల మల్లె సూస్తా ఉంటే మా అందరి మనసు పొంగిపోతాది.

రేణుక సుసర్ల
Artwork: Madhurasree

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...