31, మే 2017, బుధవారం

తపన

తనువులు వేరైనా
తపన ఒక్కటే...
మనుషులు వేరైనా
మమత ఒక్కటే...
భాషలు వేరైనా 
భావం ఒక్కటే...
పొద్దు ఉదయించే
సూర్యుడిని నేనైతే
పొద్దు కూగేక కనిపించే
చందమామ ఆమె..
పొద్దు ఏదైనా
గమ్యం ఒక్కటే...
ఇద్దరి మనసులో
రాగం ఒక్కటే
భావం ఒక్కటే...
ఇద్దరి
గుండెలో ప్రతిజ్వలించే
అనురాగ దివిటీ ఒక్కటే...
ఎన్ని ఆటంకాలు ఎదురైన
ఏ నాటికి
 మేమిద్దరం ఒక్కటే...
రేణుక సుసర్ల

ప్రకృతి

ప్రకృతి ఒక అందమైన
అమ్మ వడి..
ఒక చంటి బిడ్డకి
తల్లి ప్రేమలా
ఒక తండ్రి లాలనలా..
నీడనిచ్చే ఇల్లులా
ఎండనుండి కాపాడే
గొడుగుల
వేడి తాపం నుండి కాపాడే
రక్షక కవచంలా...
మేము వాడే వాహనముల
నుండి వెలువడే
కాలుష్య గాలిని
నువ్వు పీల్చి
మాకు మాత్రం
రక్షణ ఇస్తావు...
మాకు రాబోయే
అన్ని విపత్తుల నుండి
నీ వంతు ప్రయత్నం
నువ్వు చేసి
తల్లిలా అక్కున చేర్చుకున్న
ఘనత నీదే
మా పాలిట వన దేవత నువ్వే...
నీకు సన్నిహితురాలు
మాకు దాహార్తిని ఇచ్చే నీరు...
మాకు కావాల్సిన కూరగాయలు,
పంట పొలాలకు ఊపిరి ఆమె...
మా నిత్య జీవితంలో ప్రాణం ఆమె..
ఆమె లేకుంటే మా మానవ జాతికి
జీవం లేదు...
మనుగడ అంత కంటే లేదు...
ఇన్ని ఇచ్చిన మీ ఇద్దరిని
మా స్వార్ధం కోసం విస్మరించి...
చెట్లని నరుకుతున్నాం...
చెరువులని ,
మల్టీప్లెక్స్ పేరులతో..
పూడుస్తున్నాం...
మా జీవితాలని
మా చేతులతోనేే చిన్నా భిన్నం చేసుకుంటున్నాం....
ఒక్క మారు
పాత రోజులలోకి వెళ్లిపోని
మనసులో
స్వార్ధ చింతన మానుకోని
నీ వడిలో
నన్ను వదిగిపోని
ఓ ప్రకృతి తల్లి🙏
రేణుక సుసర్ల

చోటేది.?

మనసున
అనుమానపు ముసుగు
చీకటిలా అలుముకుంటే..
స్నేహం అనే వెలుగుకి చోటేది.?
ఎప్పుడు ఈర్ష్య ,
అసూయ జ్వాలలతో
రగిలే హృదయానికి...
ప్రేమ అనే అమృతానికి చోటేది.?
ప్రతి చిన్న విషయానికి
తప్పులేంచే వాళ్ళకి
వాళ్ళ జీవితంలో...
హితులకి,
సన్నిహితులకి చోటేది.?
భయంతో
కళ్ళు మూసుకునే వాళ్ళ
కళ్ళు తెరిపించగలం కానీ
అహంకారంతో కళ్ళు మూసుకుని వాళ్ళతో
ఎలా🤔?
రేణుక సుసర్ల
శుభోదయం

ఒంటరి

గోధూళి వేళ
పశు పక్ష్యాదులు
సద్దుమణిగి గూటికి
చేరేసమాయన్న...
సన్నగా చీకట్లు
అలుముకునే ఘడియ...
ఒక ఆదరించే మనసు
తన మనసు పడే
వేదనను , ఆనందాన్ని
పంచుకునేందుకు
నేస్తం కోసం
ఎదురు చూసింది...
కానీ
యాంత్రిక జీవితం,
పరుగిలిడుతున్న
సమయం..
కొట్టు మిట్టాడుతున్న
జీవితాల్లో
తీరిక ఎవరికి...?
సమయం
ఎక్కడిది..?
తోడుకోసం మనసు
ఆరటపడిన
కానరాని నేస్తాలు...
సమయాన్ని తన
చేతలతో చూపిస్తున్న
గడియారం
ముల్లు ల ముచ్చట్లు...
కప్పలు, కీచురాళ్ల
పిలుపులు...
వీధి కుక్కల
పలకరింపులు...
వీచే గాలి కబుర్లు..
ఆ కబుర్లకు ఉలిక్కిపడి
నేల రాలిన
ఆకుల సవ్వళ్లే
ఇక నా స్నేహితులు,
సన్నిహితులు.
ఒంటరితనం
ముసుగులో
ఉన్న నాకు
ఇంతమంది
నేస్తలున్నారని
ఇప్పుడే తెలిసింది...
రేణుక సుసర్ల

26, మే 2017, శుక్రవారం

ప్రేమ...ప్రేమ...

మదిలో విరిసె నీ
సుమధుర వాక్యల్లే ప్రేమ...
నీ సిరివెన్నెల దరహాసమె ప్రేమ...
నా నోట నీ నామ జపమే ప్రేమ...
కనులు ముందు కదలాడే నీ రూపమే ప్రేమ...
నీ పదము పదమున న అడుగుల సవ్వడే ప్రేమ...
అనుక్షణం నీకై నా మనసు తపించేదే ప్రేమ...
విరిసె కుసుమంపై కదలాడే తుమ్మెద సవ్వడే ప్రేమ
ఎదలో కదలాడే నీ అనుభూతులే ప్రేమ...
ఉషా కిరణాల సరస్సులో
నీ నగుమోము గాంచుతూ
ఆలపించే భూపాల రాగమే ప్రేమ..
సాగర తీరాన సంధ్యా కిరణాల సాక్షిగా నీ సరసన...
సాధన చేసే సంధ్యా రాగమే ప్రేమ..
పరిమితులు లేని సాన్నిహిత్యం తో ఒకరికోసం ఒకరు ఒదిగిపోయేదే ప్రేమ...
తనువులు వేరైనా ఇరువురి మనసులు కలిపేదే ప్రేమ...
రేణుక సుసర్ల
picture credit Sadasivuni Madhurasree

ప్రేమాభిషేకం

తలచిన ఘడియలన్ని
నీ తీయని జ్ఞ్యాపకాలు....
మనసు ముంగిట్లో
నీ వలపుల హరివిల్లు...
చిరు దరహాసం ముంగిట, 
మధురమైన ,
నీ ప్రేమ కావ్యాలు....
మన ప్రేమ గీతాలు ,
సప్త స్వరాలతో,
జత కట్టి ఆలపించనా....
లేక
మన ప్రణయ జీవితాన్ని ,
ఒక మహా కావ్యంగా,
రాయనా..
మన పవిత్ర ప్రేమకి ,
నా మనసులో గుడికట్టి,
నిత్యం నీకు ...
ప్రేమాభిషేకం చేయనా..
ఓ నా నేస్తమా...
రేణుక సుసర్ల
శుభోదయం 🙏

అమ్మా పూర్ణమ్మ !

అమ్మా పూర్ణమ్మ !
సాధనే ఆమె ఆభరణం
ఏకాగ్రతే ఆమె శ్వాస
ఎవరెస్ట్ .. 
పర్వత శిఖరారోహాణ
ఆమె ధ్యేయం....

నిజామాబాద్ జిల్లా వాసి
పాకాల గ్రామస్తులు
అయిన లక్ష్మీ దేవదాస్ ల గారాలపట్టి
తెలంగాణ ప్రజల ముద్దు బిడ్డ
భారత ప్రజల ఆణిముత్యం
అది...
నీవే నమ్మ మా పూర్ణమ్మ...
గిరిజన కుటుంబంలో పుట్టి పేదరికం బట్ట కప్పుకుని అహర్నిశలు నీ లక్ష్యం దిశగా శ్రమించి,
అనేక కష్టాలని సైతం ఓర్చి**
నీ ఆశయ సాధనకై వెనుకాడలేదు**
ప్రవీణ్ గారు నీ కృషికి
మంత్ర ముగ్ధుడై,
చేయూత నివ్వగా
2014, మే , 25 వ తేదీన
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించి ఏవత్ జగత్తుని సంభ్రమాశ్చర్యములో ముంచెత్తి మానవ జగత్తుకె
తలమానికం ఐనావమ్మా
మా చిన్నారి పూర్ణమ్మ..
లక్ష్యం అనే పునాది గట్టిదైతే పేదరికం అడ్డు కానే కాదని..
ఏకాగ్రత , పట్టుదలతో
ఏదైనా సాధించవచ్చని భావితరానికి అతి పిన్న వయసులోనే తెలియ జెప్పిన ఘనత నీదే నమ్మ
మా పూర్ణమ్మ...
జై హింద్🇮🇳
రేణుక సుసర్ల

నే అడిగా..

ఉషా కిరణాల పొద్దులో
కోయిల రాగం వినిపించమని
నే అడిగా..
మల్లె, చేమంతి పూదోటలో
ఝమ్మన్న తుమ్మెద రాగం 
నే అడిగా..
మనసుని దోచే పిల్లనగ్రోవి తో
మురళి నాదం వినిపించమని
నే అడిగా..
వేసవి తాపం చూపే మండు టెండలో
స్వాతి చినుకులని చల్లగా కురవమని
నే అడిగా..
మత్తెక్కించే మల్లెల సువాసన
నే అడిగా..
జాజి, విరాజాజి మాలలు నా కురులలో అలంకారం కమ్మని
నే అడిగా
వెన్నెల రేయిలొ మబ్బుల చాటున చంద్రుడిని
నాతో దోబూచులాడమని
నే అడిగా...
మనసున్న మహారాజుని ఏడేడు జన్మలకి నా మగనిగా ఇమ్మని
నే అడిగా...
వాడే నా మనసుని దోచుకున్న చెలికాడవ్వాలని
నే అడిగా..
ఎప్పుడు చెరగని చిరునవ్వు న పెదవులకు ఇమ్మని
నే అడిగా..
ఎదుటి వారిలో ఎల్లప్పుడూ మంచిని చూసే హృదయం
 నే అడిగా..
మనిషిలో మౌనానికి అర్ధం తెలిపే భాష నాకు తెలపమని
నే అడిగా..
నన్ను నన్నుగా చూసే
మనసుకి నచ్చే స్నేహితులని ఇమ్మని
నే అడిగా..
నేనే అడిగా😊
రేణుక సుసర్ల

22, మే 2017, సోమవారం

సాంప్రదాయాలు సరదాలు

ఏమండీ అత్తగారి ట్రైన్ ఎన్ని గంటలకి అడిగింది పద్మం...
ఆవిడ పూర్తిపేరు పద్మ లక్ష్మీ లెండి..
ఇంకా అమ్మ రాడానికి రెండు ఘంటల టైం ఉంది నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అన్నాడు సుబ్బా రావు...
మీ అమ్మగారికి అన్ని పద్దతిగా అనుకున్న టైం కి జరగక పోతే ఇల్లు అల్ల కల్లోలం చేసేస్తారు...
మొహం చిట్లించింది పద్మం..
మా అమ్మని అనడానికి ఒక్క నిమిషం టైం వేస్ట్ చెయ్యవుకదా అన్నట్టు గుర్రుగా చూసేడు భార్య వైపు సుబ్బారావు....
రాత్రి కి మా అక్క వాళ్ళు వస్తున్నారు ఎవరిననైన పంపుతార లేక మీరే వెళ్తారా ట్రైన్ నుండి తీసుకురాడనికి..
పాపం అది పెళ్లికి సాయం చేద్దామని వస్తోంది ముఖం చేటంత చేసుకొని చెప్పింది పద్మం....
అలాగె లే రాత్రి కదా ఆలోచిద్దాం
మొదట అమ్మని తేని.. అని హడావిడిగా స్టేషన్ కి బయలుదేరాడు.. సుబ్బారావు.
పది రోజుల్లో పద్మం, సుబ్బారావు ల ఏకైక కూతురు వాగ్దేవి పెళ్లి జరగబోతోంది...అది హడావిడి.
సుబ్బారావు తల్లి పాతకాలపు మనిషి అయిన కొడుకు, కోడలు మనవరాలు అంటే ప్రాణం..
కాకపోతే ఆవిడకి సాంప్రదాయాలు, పద్ధతులు పాటించకపోతే ఒప్పుకోదు..
అందుకే కోడలు అత్తగారి చాదస్థానికి విసుకున్న..
ఆవిడంటే మహా గౌరవం కూడా....
పద్మం ఆలోచనల నుండి తేరుకోకముందే సుబ్బారావు తల్లి రమణమ్మ ,కొడుకుతో పాటు లోపలికి రావడం పెళ్లి సందడి ఒక ఊపు అందుకుంది పెద్దావిడ రాకతో..
పద్మం అత్తగారి సేవలో ములిగిపోయింది అప్పుడే పెళ్లి బట్టలు కుట్టే tailor నుండి వచ్చిన వాగ్దేవి బామ్మని చూసి అమాంతం వాటేసుకుని కళ్ళంబడ నీళ్లు తెచ్చేసుకుంది...
పోవే బామ్మ ఇప్పుడా రావడం అని బుంగ మూతిపెట్టి అలగడం చూసి పాపం ఆ ముసలావిడ ఆనందానికి హద్దులేకుండా పోయింది.
దగ్గరుండి నాయనమ్మకి తన నగలు, బట్టలు చూపించి వాగ్దేవి మురిసిపోయింది..వీళ్ళ ప్రేమ చూసి సుబ్బారావు కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి..
ఇంతలో కొరియోగ్రాఫర్ సత్యం ఫోన్ చెయ్యడంతో నాయనమ్మకి చెప్పి కొంచం దూరంగా వాగ్దేవి ఫోన్ లో మాట్లాడి వచ్చాక ..
రమణమ్మ గారు అడిగింది ఏంటి బంగారం ( వాగ్దేవి ముద్దు పేరు ) ఎవరిది ఫోన్.?.
కాదే బామ్మ నా పెళ్లికి మహంది, హలది ఫంక్షన్ నాడు డాన్స్ నేను నా ఫ్రెండ్స్ చేస్తాం కదా అది నేర్పడానికి డాన్స్ మాస్టర్ గారితో ఫోన్లో appointment..
ఈ హలది, మహంది ఫంక్షన్ ఏమిట్రా మధ్యలో...ఇదిగో అమ్మాయి పద్మం ఇదేమి మాట్లాడుతోంది కాసింత గద్దించి అడిగింది రమణమ్మ కోడల్ని..
direct గా మనవరాలిని అడగలేక...
పద్మం నీళ్లు నములుతూ అది కాదు అత్తయ్య ఈ మధ్య అందరూ ఇలాగే చేస్తున్నారు అందుకే వాగ్దేవి కూడా సరదా పడితే నేను, మీ అబ్బాయి కాదనలేకపోయాము అని ఆ తప్పు తమది కాదనట్టు సంజాయిషీ ఇచ్చుకుంది..
ఎందుకంటే ఈ హలది, మహంది
ఫంక్షన్ డౌబ్ట్ అత్తగారి విషయంలో పద్మం కి ఎప్పుడో వచ్చింది..
అది చిన్న పిల్ల దానికి అంటే మన పద్ధతులు, సంప్రదాయాలు తెలీవు మీ ఇద్దరికి ఏమయ్యింది? నేను అలా నాలుగు రోజులు ఊరు వెళ్ళానో లేదో.. అంత మీ ఇష్టమేన? ఒక పెద్ద దాన్ని ఏడ్చి సచ్చానుగా నన్ను అడిగి చావాలిగా...
ఇంకా నయం సమయానికి వచ్చాను ఎదో నేరం ఘోరం జరిగిపోను అన్నట్టుగా రమణమ్మ గారు తిట్లు లంకించుకున్నారు కొడుకు, కోడల్ని..
పాపం పద్మం కిక్కురుమనకుండా సుబ్బారావు నే చూస్తూ ఉండిపోయింది..మీరే ఏదో సద్దిచెప్పాలి అన్నట్టుగా..పద్మంకి తెలుసు రమణమ్మ గారి పట్టుదల..
సుబ్బారావు ఎదో అనబోయాడు అమ్మ ఇదంతా ఇప్పుడు మాములేనే...అని అంతే
రమణమ్మ కోపం తారాస్థాయికి చేరుకుంది...
ఏంట్రా మాములు... పెళ్లికూతుర్ని చేసిన రోజు ఇంట్లో పెద్ద వాళ్ల చేత పెళ్లి కూతురికి పసుపు రాయించడం మన సంప్రదాయం..
ఆ రోజే గోరింటాకు పెట్టడం అంతే కానీ పసుపు రాసిన రోజు, గోరింటకు పెట్టుకున్న రోజు గెంతడాలు మన పద్ధతి కాదు సంప్రదాయం అంత కంటే కాదు...
చూడు అబ్బాయి నేను ఎవరి సంప్రదయాల్ని గౌరవించద్దు అనటం లేదు..
మనం భారతీయులుగా పక్క వాళ్ల పద్దతుల్ని, సంప్రదాయాల్ని గౌరవించాలి అంతే కానీ ఆచరించక్కరలేదు...
పోని ఒకటి అడుగుతా చెప్పండి అప్పటికే బామ్మ నోటికి చుట్టాలందరు పోగయ్యారు...అందుకే అందర్నీ ఉద్దేశించి అడిగేరు రమణమ్మ గారు..
మన పద్ధతులని, సంప్రదయాల్ని ఎవరేనా పాటిస్తున్నార? మనలా పెళ్లికి నెల్లాళ్ల ముందు గోధుమ రాయి పెడ్తున్నార, లేక పెళ్లిలో తోట సంబరం కానీ, కాశీ యాత్ర కానీ చేస్తున్నారా?
పాయింటే బామ్మ ఎవడో గడుగ్గాయి అరిచి చప్పట్లు కొట్టాడు..
వెధవ తెగుళ్లు మన పద్దతుల్ని మంట కలిపి పక్క వాళ్ళవి నెత్తి కెక్కించుకోడం మన తెలుగు వాళ్ళకి అలవాటే..మొత్తం తెలుగు వాళ్ల మీద మండి పడింది బామ్మ..
ఎవరు ఎలా ఛస్తే చావని నా మనవరాలి పెళ్లి మాత్రం అచ్చమైన మన తెలుగు సంప్రదాయంలోనే జరగాలి అని ఆర్డర్ వేసింది బామ్మ...
వాగ్దేవికి కూడా బామ్మ లాజిక్ నచ్చి ఫోన్ తీసుకుంది కొరియోగ్రఫీర్ తో appointment cancel చెయ్యడానికి...
ఎవరి పద్దతుల్ని కించపరచాలని కాదు కానీ మనవి గాలికి వదిలేసి సరదా పేరిట పక్క వాళ్ల ఆచారాలని ప్రమోట్ చెయ్యడం ఎంతవరకు న్యాయం..
ఆలోచించాల్సిన విషయమే🤔
రేణుక సుసర్ల

21, మే 2017, ఆదివారం

మోహం

అలసిన
నా మనసుకు
నీ జ్ఞ్యాపకాల వడిలో
నిదురపోవలని ఉంది...
గడచిన నా గతాన్ని....
మరపు పునాదుల్లో
శిథిలం చెయ్యాలని ఉంది.
మిగిలిన జీవితపు రహదారి
నీతో నడవాలని ఉంది..
నీ చల్లని వడిలో
సేద తీరాలని ఉంది
నీ మనసులో ఎప్పుడు,
నేను చెరగని ముద్రగా,
నిలవాలని ఉంది..
ఇది సాధ్యమేనా నేస్తమా
అని ఒక్క సారి.....
నీ కళ్ళలోకి చూస్తూ
అడగాలని ఉంది....
రేణుక సుసర్ల

మన పల్లెటూరు

ప్రకృతికి సోయగాలకు
పుట్టినిల్లు
అనురాగాలకి,
ఆప్యాయతలకి
పెట్టిన ఊరు
సహాయానికి
మారు పేరు
బంధుత్వం
కలుపుకోడంలో
ముందంజ
వేసిన ఊరు.

సంస్కృతి,
సత్కారాలకు ఆనవాళ్లు
అతిథి,అభ్యమగతులను
ఆదరించడంలో
ఏ మాత్రం
వెనుకంజని
వెయ్యని ఊరు..
పండగలని,
ఉత్సవాలను
అందరూ ఒక్కటై
జరుపుకునే ఊరు
ఏ ఇంటి ఆడపడుచు నైన
తమ ఇంటి మర్యాదగా
చెప్పుకునే వారు
ఒకరి కష్ట, సుఖాల్లో
పిలవకుండా
పాలుపంచుకునే వాళ్ళు.
సుబ్బమత్త, రామయ్య తాత
కాంతం పిన్ని, సూరి బావ
అని నోరార పిలుపు
వినిపించే ఊరు.
పండగ నాడు....

హరి దాసుల కీర్తనలు,
కోడిపందాల జోరు,
పేకాట రాయుళ్ల హోరు,
కనిపించే ఊరు...
అచ్చనైన తెలుగుతనం
అద్దం పట్టే ఊరు
మనమందరం మెచ్చే ఊరు
మన పల్లెటూరు...
రేణుక సుసర్ల

నాలుగు పదుల వయసు

సరదా సరదాగా😁
వచ్చింది నాలుగు
పదుల వయసు
నట్టేట్ట ముంచేటట్టు
ఎటేట్టా
భగవంతుడా అనేటట్టు
కనపడుతోంది
జుట్టు నెరిసేటట్టు
ఇక పడాలి రంగులతో కుస్తీ జుట్టు మెరిసేటట్టు..
జుత్తు ఉన్నవాళ్ళకి కుస్తీ లేనివాళ్ళకి విగ్గే ఆస్తి😛
పెరిగింది వయసు అన్నా ఒప్పుకోని మనసు
ఇంకా యూత్ అందామన్న నలభై దాటింది వయసు...
కళ్ల జోడు పెట్టుకుంటే
Uncle, Aunty
పిలుపే దక్కు
లేకపోతే సరిగ్గా
కనపడక
కిక్ మీద కిక్..
నాలుగు అడుగులు
వేస్తే ఆయాసం
కానీ ఒప్పుకుంటే
మనసుకు నీరసం..
పెరిగే పొట్టతో ఇక్కట్లు
తగ్గడం కోసం
రకరకాల పాట్లు
దానితో ఇంట్లో
ఖజానాకు తూట్లు..
అందుకే మనసుతో
ఫీల్ అవ్వండి
యంగ్
చేసుకోండి
మీ లైఫ్ థ్రిల్లింగ్...
వయసు మనిషికే కానీ
మనసుకి కాదండోయ్😁
రేణుక సుసర్ల

అమృతమూర్తి ఐన అమ్మకు నమస్సుమాంజలి

అమ్మ!
దేముడు సృష్టించిన
తీయని పదం.
తను!
మాట్లాడే ప్రతి పలుకు
నాలో ప్రతిబబించిన
ఒక వెలుగు.
తను!
చెప్పిన ప్రతిమాట నేర్పే
ఒక జీవిత సత్యం.
తను!
ఇచ్చే ఓదార్పు
నా మనసుకు
చేకూర్చే చల్లని సేద.
తను!
ఇచ్చిన ప్రతి సలహా,
నా ప్రగతికి తొలి మెట్టు.
తను!
నాతో వేసిన ప్రతి అడుగు,
నాలో ఊపిరి పోసిన ధైర్యం.
తన మాట, పలుకు, ఓదార్పు అన్ని ఏకమై నాలో
ఇనుమడించిన సంపూర్ణ వ్యక్తిత్వం.
అమ్మా! జన్మ నిచ్చిన తల్లివై నన్ను లాలించావు!
తండ్రిలా నన్ను ప్రేమించావు,
నేస్తమై కష్టాల్లో
నాకు ధైర్యాన్ని ఇచ్చావు .
గురువు వై నాలో
జ్ఞ్యానాన్ని పెంపొందించావు.
ఇన్ని ఇచ్చిన నిన్ను
నేను ఏ నాటికి మరువలేను...
ప్రేమతో నీ చంటి ( రేణుక).

అహంకారం

ఆవేశనికి
అహంకారం తోడవుతే
అర్ధాలే వేరుగా
కనపడతాయి.
మనసుతో ఆలోచిస్తే 
మమతలే పరిమళిస్తాయి
సున్నితంగా ఆలోచిస్తే
స్నేహ గీతికలే
రాగలుగా పలుకుతాయి..
స్నేహానికి
మధుర జ్ఞ్యాపికలు
స్మృతులుగా
నిలవాలి కానీ...
గుండెలో
మానని గాయాలు
కాకూడదు..
మనిషికి గాయమైతే
వచ్చేది కన్నీరు
మరి ???
మనసు పదే పదే
గాయ పడితే వచ్చేది...???
మౌనమే😐
రేణుక సుసర్ల

మధుర స్మృతులు

గడచిన కాలం తిరిగిరానిది
మరుగున పడిన
తలపులు
మధుర స్మృతులుగా 
మిగిలిపోని....
తీరని బాసలు
తీపికలలు గా
కరిగిపోని....
చేరువవ్వని నేస్తాలు
చెరగని ముద్రలా
నిలిచిపోని....
చేసిన ప్రమాణాలు
మదిలో శిలలా
రూపుదిద్దుకోని....
అర్ధం కాని ఆవేశాలు,
చేసిన పొరపాట్లు
జీవితంలో నేర్చుకున్న పాఠాలుగా ఉండిపోని...
నేర్చుకున్న
అనుభవాలు
తెలుసుకున్న నిజాలు,
కొత్తగా మదిలో
నింపుకున్న
ఆప్యాయతలతో,
నన్ను నన్నుగా ప్రేమించే
నా వాళ్లతో,
నా ఈ మిగిలిన
జీవిత రహదారిలో
హాయిగా సాగిపోని...
ఓ కాలమా😊...
రేణుక సుసర్ల

అంకెల గారడి

సరదా సరదాగ....😉
నిజమైన భాగ్యవంతుడు...
"10" మందితో కలుపుగోరుగా
మెలిగే వాడు
రోజుకి
"9"గ్లాసుల నీళ్లు తాగేవాడు
"8" గంటల నిద్ర ఉన్నవాడు
ప్రపంచంలో
"7" వింతలని చూసి వచ్చిన వాడు..
"6" అంకెల నెల జీతగాడు..
"5"రోజులు వారానికి పనిచేసేవాడు..
"4 "చక్రాల వాహనం కలిగినవాడు..
"3" బెడ్రూమ ల సొంత ఇల్లు ఉన్నవాడు..
"2" (ఇద్దరు) రత్నాల లాంటి సంతానం కలిగినవాడు..
"1" సద్గుణాల రాశిని జీవిత భాగస్వామగ పొందినవాడు..
అప్పుడు ఆ మనిషికి
అశాంతి అన్నది..
"0".
అంతే కాని స్విస్ బాంక్
అకౌంట్ లో ఖాతా
ఉన్నవాడు కాదండోయ్😁.
రేణుక సుసర్ల

మృగం

ఎన్ని యుగాలు
గడిచిన ...
ఎందరు మహానుభావులు చెప్పిన ...
ఎన్ని చట్టాలు వచ్చిన..
ఎన్ని ప్రభుత్వాలు మారిన...
ఆలి అన్న దానికైతే
రక్షణే లేదురోయి..
రాక్షస సమాజంలో
నిలువ నీడ కూడా
లేదురోయి..
అడుగుపెట్టే
ప్రతి చోట
తోడేళ్లే దక్కురోయి..
వయసు లేదు..
వరస లేదు..
మగాడంటే అంతేరోయి..
చదువులేమో బారెడు..
సంస్కరమేమో మూరెడు..
అందరూ ఉన్న చోట
మంచితనం ముసుగు తొడుగునోయ్..
ఎవ్వరు కనని చోట
ఆడ దాన్ని
వంచించునోయ్...
అందరూ
సిగ్గుపడాల్సిన
తరుణం మిదేనోయ్...
మన దౌర్భాగ్యపు
సమాజం ఇదేనోయ్...
నాటి నుండి
నేటి వరకు
మన స్త్రీ జాతి
బతుకింతేరోయి...
మనమిక
మారాలి...
గొంతు ఎత్తి
అరవాలి...
న్యాయ పోరాటం
చెయ్యాలి..
ఒకరికి ఒకరు
చేయూత
నివ్వాలి...
రేణుక సుసర్ల

కావ్యం

మనసులో ఎగిసే
భావతరంగాలు..
మదిని తాకినప్పుడు..
ఆలోచనలు
ఉత్పన్నమవుతాయి..
ఆలోచనలకు
అక్షర రూపం ఇస్తే
మనసుకు
అందని కావ్యం
రూపుదిద్దుకుంటుంది..
మాటలకు అందని
భావాలు మనసులోంచి
కావ్య రూపంలో
వెలువడినవే
నిత్య సత్యాలు గా
మారుతాయి..
ప్రేమ, బాధ,
స్నేహం , విరహం
ఆవేశం, ఆగ్రహం
ఏదైనా కానీ కొత్త
అర్ధాలు తెలుపుతాయి...
ఊహలకు రాని ఊసులు
రెక్కలొచ్చి ఎగురుతాయి
మాటల్లో తెలుపలేని
భావాలు
కవితగా మారి
పలువురి హృదయాలని
రంజింప జేస్తాయి...
ఇంకొందరిని
ఆలోచింపచేస్తాయి...
శ్రీశ్రీ గారు చెప్పినట్టు
కళ్లంటూ ఉంటే చూసి...
వాక్కుంటే వ్రాసి...
ప్రపంచమొక
పద్మవ్యూహం...
కవిత్వమొక
తీరని దాహం...
రేణుక సుసర్ల

ఓ సూర్యుడా...

ఓ సూర్యుడా...🌞
కాలుతోంది నిప్పుల
కొనిమిల భూగోళం...
మండుతోంది
అగ్ని గోళంలా 
ప్రపంచం...
నాట్యమాడే నటరాజుల
ఉంది నీ రూపం...
ఎవరి మీద ఈ కోపం
ఎంతవరకు నీ ఈ ప్రతాపం...
ఓ సూర్యుడా...🌞
అల్పుడి మీదా నీ రాజ్యం?
కష్ట పడే మనిషిపైనే గా
నీ ఆక్రన్దన..?
ఎందుకు నీ ఈ
ఉగ్ర రూపం..?
కరిగిపో సూర్యుడా ..
చల్లని నీలి
మేఘాల వడిలో...
సాగిపో చిరు జల్లుల
వాన వెల్లువలో...
తీర్చుకో నీ దాహం
వడి వడి గా పడే
జడివానలో...
ఓ సూర్యుడా...🌞
ఒదిగిపో మబ్బుల
చాటున
ఒక్క సారి...🌦
రేణుక సుసర్ల

నా ఒరిస్సా


ప్రకృతిసోయగాలకు పెట్టింది పేరు
హస్తకళలలో పేరుగాంచిన వారు
శిల్పకళలలో బహు ప్రావీణ్యులు
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన
సూర్యదేవలయం కోణార్క్,
పూరి జగన్నాథ స్వామి,
భువనేశ్వర్ లింగరాజ్
మందిరాలు వెలసిన ప్రదేశం...
చరిత్ర సృష్టించిన
కళింగ యుద్ధం జరిగిన స్థలం ,
ఉత్కళమణి గోపాబంధు దాస్,
నీలకాంత్ దాస్,
హరిహర ఆచర్జ్య ,
ఇలా కోకొల్లలు
పండితులు పుట్టిన రాష్ట్రం..
ప్రపంచాల కట్టడాలలో చోటు సంపాదించుకున్న
హిరాకుడ్ ఆనకట్ట,
రూర్కెలా ఉక్కు కర్మగారం
మనవేనోయ్...
నోరురూరించే చెన్న పొడ,
సాలేపుర్ రసగుల్ల,
గుగుని ల మేళవింపు...
కుర్ర కారుని హోరెత్తించే
ప్రసిద్ధిగాంచిన
రొంగోబొతి జానపదం,
మనసుని రంజింపజేసే
ఒడిసి నృత్యం...
మన ఒరిస్సా రాష్ట్రానికే చెల్లు..
అలాంటి మహనీయమైన రాష్ట్రంలో పుట్టినందుకు
గర్విస్తూ...
నా ఒరిస్సా మిత్రులందరికీ 🙏
రేణుక సుసర్ల

7, మే 2017, ఆదివారం

సాహిత్య పిపాసి

సరిగమలు లేవు
నా సాహిత్యంలో
పదనిసలు పలుకలేెను
నా కవిత్వంలో
అ, ఆ లు దిద్దలేదు 
ఈ కావ్యాలలో
ఏ గురువు నేర్పలేదు
సంధులు, దీర్ఘాలు.
ఛందస్సు అసలే లేదు
నా భాషా ప్రయోగంలో
నాకు మనసే కాగితం
ఎదలోని భావాలే
 నా బీజాక్షరాలు
మనసులో కలిగే
బాధ, ఆవేశం,
ప్రేమ, సంతోషం
మే .... నేను
నా కావ్యాలకు
ఇచ్చే అలంకారాలు.
విరహ కావ్యాలు
నా కనీళ్లై
ప్రేమ కావ్యాలు
నా ప్రేరణగా
ఆవేశ అక్షరాలు
నా ఆలోచనలవ్వగా
సంతోష భావాలు
నాలో
శాంతిని నెలకొల్పాయి..
నా ఈ సాహిత్య
ప్రపంచంలో
తొలి మెట్టుపై
అడుగు పెట్టిన
నన్ను
మీ ప్రోత్సాహ గుళికతో
ఉత్సాహ పరుస్తారని
ఆశిస్తూ
ఒక సాహిత్య పిపాసి...
రేణుక సుసర్ల

ఆమె

ఆమె

ఆమెకి కావలసినంత టైం తీస్కొనీండి..
ఆమె తాగిన కప్ కాఫీ హాయిగా తాగనివ్వండి....ఎన్ని ఉదయాలు తన అయిన వాళ్ల కోసం ఎన్ని చల్లని కాఫీలు తాగలేదు...
తన కప్ కాఫీ తాగే ముందు అందరి కి అన్ని రెడి చేసి కూర్చున్న ఆమెని కాసేపు అలాగే ఉండనివ్వండి.
బయట హోటల్ కి వెళ్ళినపుడు ఆమెకి నచ్చినవి ఆర్డర్ చెయ్యనివ్వండి....
రోజు ఇంట్లో అందరికి ఇష్టమైనవి ఆమె వండినపుడు ఒక్క రోజైన తనకు నచ్చింది వండుకుందామని ఆమె. ఆలోచించలేదు...
బయటకి వెళ్ళేటప్పుడు తయారవ్వడానికి ఆమెకి నచ్చిన సమయం తీస్కొనీండి...
తన భర్త, పిల్లలు అందరి ముందు బాగా కనిపించాలని బట్టలు సరిగ్గా ఐరన్ ఐ వాటి ప్లేస్ లో ఉన్నాయా లేదా అని పదే పదే మనకి అన్ని ఆమె సమయానికి సమకూర్చ లేదు..
టీవీ చూసిన పది నిమిషాలు అయిన ఆమెకి నచ్చినది చూడనివ్వండి ఎంతసేపు ఆమె చూస్తుందని...చూసిన పరధ్యానంగానే కదా...
అయ్యో అతనికి, పిల్లలకు డిన్నర్ టైం అయిందిఏమొ...
అత్తగారికి మందుల టైం ఏమో ఇదే ధ్యాస ఆమెది..
breakfast లేట్ గా సర్వ్ చేస్తే చెయ్యనివ్వండి ...
ఎంత లేట్ గా చేసిన మనకి మాత్రం రుచిగా ఉన్నవి, బాగున్నవి కదా వడ్డిస్తుంది.. తాను మాత్రం మాడిన అట్లు, బ్రెడ్ ముక్కలు తింటుంది..
సాయంత్రం వేళ టీ తాగాక..కాసేపు అన్ని మరిచి హాయిగా కిటికీ లోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ తన్ని తాను మరిచిపోనివ్వండి...
ఎన్ని సాయంత్రాలు తన అయిన వారికోసం కేటాయించలేదు ఆమె..
ఎన్ని పగళ్లు, ఎన్నెన్ని రాత్రులు తన అయిన వారికోసం నిద్ర , తిండి మాని సేవ చెయ్యలేదు..
తనకోసం జీవితంలో ఆ మాత్రం సమయం ఇవ్వడం సబబే కదా...
అవునంటారా ? కాదంటారా?🤔
ఆమె ఒక తల్లి,
ఒకరి ఇల్లాలు,
ఒకరి కోడలు....
ఏవత్ స్త్రీ జాతికి నా హృదయ పూర్వక 🙏
An Inspiration From An English Article..
రేణుక సుసర్ల.

చాయ్ చాయ్

చాయ్ చాయ్ అంటూ
పొద్దునే కూసింది ప్రపంచం
నిద్ర మత్తు వదిలి పోయింది
వళ్ళు చాయ్ పిలుపుకు పులకించిపోయింది.
రాత్రి మిగిలిన చపాతీ నవ్వింది
చాయ్ లో ముంచుకు తినమని సలహా ఇచ్చింది.
బాక్స్ లో ఉన్న ఉస్మానియా, బిస్కేట్ మదిలో మెరిసింది,
నా పెదవి పై నవ్వే విరిసింది.
కొట్టవో చాయ్ .
మనసును ఉల్లాసపెట్టవోయ్...
భాయ్...
న్యూస్ పేపర్ చేతిలో
కొచ్చింది
నోరు చాయ్ కోసం ఆరటపడింది.
లొట్టలు వేస్తూ చాయ్
గొంతులో దిగుతూ ఉంటే
హాయ్ హాయ్
గుడ్లు మిటకరిస్తూ పేపర్ చదువుతూ ఉంటే
మనసంతా హాయ్ హాయ్.
కొట్టవో చాయ్...
మనసుని ఉల్లాసపెట్టవోయ్...
భాయ్....
స్నేహితుల అడ్డ దగ్గర గప్ప కొడుతూ చాయ్...
టెన్షన్ వస్తే
 చాయ్ మీద చాయ్
పకోడీతో చాయ్....
మిర్చి బజ్జెతో చాయ్...
పని ఉన్న చాయ్....
టైం పాస్ కోసం చాయ్...
సామాన్యుడి ప్రపంచమే
చాయ్ తో హాయ్😂 హాయ్
పీలో మేరే భాయ్ భాయ్
రేణుక సుసర్ల

ఓ కార్మికుడా!

చుక్క చుక్క నేల కొరిగి చెమటోడ్చినోడా
ఓ కార్మికుడ
నీకు నా సలాం..
రాయి, రాయి పేర్చి కట్టు భవనాల సొగసు కష్టం నీదేర
ఎండ లేదు, వాన లేదు
సమయానికి తిండి లేదు
ఓ కార్మికుడా!
కష్టమంత నీదేరా...
కండ బలం చూపించి
కొండని సైతం పిండిచేసి
పగలనక, రేయనక
రహదారులు వేసినోడ..
ఓ కార్మికుడా!
కష్ట మంత నీదేరా....
భార్య బిడ్డల్ని
సైతం వదిలిపెట్టి,
ఉన్న ఊరు విడిచిపెట్టి ,
ఊరు కానీ ఊరులో ,
అయిన వాళ్ళు లేని చోట ,
బతుకు బండి నీవు ఈడ్చేర
ఓ కార్మికుడా!
కష్టమంత నీదేరా.....
మేడ, మిద్దలైన కానీ,
రహదారులైతే నేమి,
ఫ్యాక్టరీలు, కంపెనీలు,
పాడి, పంట అయిన నేమి,
తొడిగిన చెప్పు, కట్టిన బట్ట,
ఏరిన చెత్త, ఏది అయిన
ఏమి కానీ
కష్ట మన్నది నీదేర..
మా సుఖం కోసం ,
కష్ట పడ్డది నీవేర ...
ఓ కార్మికుడా!
మండే ఎండలో
ఎన్డే గుండెతో
చేసే కష్టం, వచ్చే నష్టం
లెక్క సేయనోడివిరా!!!
ఓ కార్మికుడా నీకు నా సలాం
ఓ అన్న నీకు నా ప్రనామ్🙏
రేణుక సుసర్ల

బతుకు బండి

బతుకు బండి పోరాటం
సగటు మనిషి ఆరాటం
అసలే
అర కొర జీతాలు,
పెనవేసుకున్న బంధాలు,
బాధ్యతల సంకెళ్లు,
చేతికందని సంతానం,
వృధాప్యంలో ఉన్న, తల్లితండ్రులు.
కొలిక్కిరాని సమస్యలు
ఉక్కిరిబిక్కిరి అవుతున్న
నా ఈ జీవితం.
దగ్గర పడ్డ ,
పదవీ విరమణ వయస్సు.
ఈ సమయములో
సమస్యల ఊబి నుండి ,
నన్ను లాగేదెవరు?
అక్కున చేర్చుకునేదెవరు?
తోడు నిలిచేదెవరు?
వెలుగు నింపేదెవరు?
నా సమస్యలకి ,
పరిష్కారమే లేదా!
ఈ బాధ్యతల ,
సంద్రము నుండి ,
ఒడ్డుకి చేరనేలేన?
అని ....🤔
ఆలోచనల వలయంలో కొట్టుమిట్టాడుతోంది
నా ఈ దీన హృదయం...
ఒక చిరు ఉద్యోగి ఆవేదన😢
రేణుక సుసర్ల

అనుభూతి

ఎప్పుడో ఎక్కడో ,
పోగొట్టుకున్న ,
'నన్ను'
ఈ కాగితాల్లోనే రోజూ,
వెతుకుతూ ఉంటాను...
అనంతాలలో పారేసుకున్న,
అనుభూతుల వెచ్చదనాన్ని,
ఈ కాగితాల్లోనే దాచుకుని,
నిత్యం తడుముతూ ఉంటాను....
ఎన్నో ఆశలు,
ఎన్నో ఆశయాలు
ఎన్నో ఆదర్శాల ఆవేశాలు
ఈ కాగితాల్లోనే
రెప రెపలాడాయి.....
ఎన్నో కలలు కన్నీరై
ఎన్నో ప్రేమలు స్మృతిగీతాలై
ఈ కాగితాల్లోనే ఇంకుచుక్కలై ఇంకిపోయాయి.....
రాయాలని ఉన్న రాయలేక
రాయకుండా వుండలేక,
పూటపూటకి ,
ఎన్నోపురిటి నెప్పులు...
ఈకాగితాల్లోనే ,
పూర్తికాకుండా ,
నిలిచిపోయాయి....
కలకాలం నిలువలేక,
కలిసి నాతో రాలేక,
కదిలిపోయిన,
వసంతాలెన్నో,
ఈ కాగితాల్లోనే ,
పూలరెక్కలయి ,
మిగిలి పోయాయి....
ఎప్పుడో ఎక్కడో
పోగొట్టుకున్న 'నన్ను'
ఈ కాగితాల్లోనే రోజూ
వెతుకుతూ ఉంటాను.
అందుకే ఎదలోని ,
ఎగిసే భావోద్గ్వేగాన్ని,
అక్షర రూపంలో ,
ఈ కాగితాల్లో ,
పేరుస్తూ ఉంటాను....
రేణుక సుసర్ల

ప్రేమ

కార్చేది ఎప్ఫడు కన్నీరే
చిరునవ్వు మాత్రం సింగారించుకున్నది
మాట లేకున్నా మవునమే చాలనుకున్న..
ప్రేమ లేకున్నా తిరస్కారమే ముద్దనుకున్న..
హృదయము పాషణమని తెలిసిన 
శిల్పంగా మరల్చుకుందా మనకున్న....
ఆవేదన ని కూడా నైవేద్యంలా స్వీకరించా...
నీ నిర్లక్షం లో కూడా ప్రేమని వెతుకు తున్న ఓ నేస్తం
శుభోదయం
రేణుక సుసర్ల.

నేను ఎవరిని?

నేను ఎవరిని?
సహనం,ఓర్పు
అలంకారంగా తొడుకున్న
శాంతి దూతన
లేక,
అభిమానం, అనురాగం దుప్పటిగా కప్పుకున్న ఆత్మీయురాలిన
లేక,
అణువణువున
ఉరకలేసిన ఆవేశంతో ఉర్రుతలూగిన
నారిమణినా..?
నేను ఎవరిని..?
అక్కున చేర్చుకుని
కమ్మనైన అమ్మతనం
చూపించే మాతృమూర్తినా
లేక,
అడుగడుగు నా స్నేహ
హస్తం అందించే
స్నేహితురాలిన
లేక,
మనువాడిన వాడి
మనసున కొలువై ఉన్న
మగువకు ప్రేరణనా..?
నేను ఎవరిని..?
అందరూ నా హితులు, సన్నిహితులు అనుకొని
నమ్మే మూగ జీవినా
లేక,
ఎన్ని మార్లు మోసపోయిన
తిరిగి నమ్మే
ఆశవాదిన
లేక ,
మంచితనాన్నే నమ్మే
సిద్ధాంత వాదినా..?
ఎవరిని నేను ఎవరిని...?
ఎవరినైనా ఏమైనా...
ఈ పయనం ఆగనిది...
ఈ ఆరాటం మారనిది...
గమ్యం ఎటో తెలియని...
జీవితపు రహదారిలో ...
అలుపు ఎరగకుండా ...
నిర్మలమైన మనస్సుతో...
చిరు దరహాసంతో...
స్నేహ భావంతో...
ముందుగు సాగిపోతూనే
ఉన్న నేను ***
అందరికి
ఆత్మబంధువిని....😊
రేణుక సుసర్ల

అంతరాత్మ...

అంతరాత్మ...

అమ్మ! చివరిగా చెప్తున్న నేను పెళ్లి అంటూ చేసుకుంటే సౌమ్య నే చేసుకుంటే లేకపోతే అజన్మ బ్రాహ్మచారిగా ఉండిపోత ఆ పైన మీ ఇష్టం అని ఉదయ్,ఢంకా మీద కొట్టి మరీ చెప్పాడు కాంతమ్మ కి గురునాథం గారికి.
ఉదయ్, సౌమ్యని ఒక చుట్టాల ఇంట్లో పెళ్లిలో చూసి మనసు పారేసుకున్నాడు...
ఆ అమ్మాయి గురించి అన్ని enquiry చేసి అంత మంచి అమ్మాయి జీవిత భాగస్వామి అవుతే చాలని పగలు, రాత్రి వెయ్యి దేముళ్ళకి మొక్కకున్నాడు ఉదయ్.
దేముడి వర మిచ్చిన పూజారి వరమివ్వడని కాంతమ్మ పంతం పెట్టి కూర్చుంది..ససేమిరా ఆపిల్ల ఇంటికి కోడలిగా వద్దని.
కాంతమ్మ, గురునాథం దపంతులకి ఇద్దరు కుమారులు...పెద్ద వాడు ఉదయ్ Income టాక్స్ ఆఫీసర్...
రెండవ వాడు గిరి చెన్నై లో software ఉద్యోగి..
కాంతమ్మకి అదే బడాయి.. తన కొడుకులిద్దరు పెద్ద positionలో ఉన్నారు కనుక ఏ రంభో, ఉర్వసో... కోడలిగా రావాలి బాగా డబ్బు ఉన్న అమ్మాయి అయి ఉండాలి అని సగటు ఆడవాళ్లలాగే కోరుకుంది.
ఆ కోరిక బాగా ఆవిడ మనసులో రాచ పుండులా తయారైంది ...
ఇలాగే కాంతమ్మ తన తమ్ముడి పెళ్లి పెత్తనం, ఇంటికి పెద్దది కదా
అని అప్పచెప్తే నాన వంకలు పెట్టి పాపం షష్టి పూర్తి అయిన కూడా అతగాడికి పెళ్లి అవ్వనివ్వలేదు..
కాంతమ్మ అన్నకి మాత్రం ఈవిడ కంటే ముందు పెళ్ళిఅవ్వడం వల్ల బతికిపోయాడు..ఇద్దరు అన్న, తమ్ములకి ఈవిడ ఒక్కర్తే ఆడబిడ్డ...అందుకే ఈవిడంటే అన్న, తమ్ములకి బాగా ముద్దు...
బావమరిది పెళ్లి పెటాకులు లేకపోడానికి కాంతమ్మ గారే కారకురాలు కనక గురునాథం కంగారు పడి నానా తంటాలు పడి నయానో, భయానో కాంతమ్మని కొడుకు పెళ్లికి ఒప్పించాడు. గురునాధానికి కూడా గుండె జబ్బు ఉండడం వల్ల కాంతమ్మ మరీ మొండి పట్టు పట్టక ఎలాగో ఒకలాగ ముక్కుతూ , మూలుగుతూ సరే నంది.
మొత్తం మీద పెళ్లి అయి సౌమ్య కాపురానికి అత్తగారింటికి రానే వచ్చింది..
పాపం సౌమ్య పేరుకు తగట్టు చాలా నెమ్మదస్తురాలు..ఆమెకి తల్లి అన్నపూర్ణమ్మ పోలిక. తండ్రి సుబ్బారావు మాత్రం కాలంతకుడు..
అన్నపూర్ణమ్మకి అందరూ ఆడపిల్లలు కావడం పెళ్ళాం, పిల్లల్ని సుబ్బారావు లెక్క చేసేవాడు కాదు...
సహజంగా బుద్దిమంతురాలు, ఇంటికి పెద్దది ఇంట్లో పరిస్థితుల వల్ల కూడా సౌమ్య బాగా సద్దుకుపోయే మనస్తత్వం గల పిల్ల.
సౌమ్య వచ్చిరావడంతో అందరి ఇష్ట ఇష్టాలు తెలుసుకొని బాగా కలివిడిగా ఉంటూ, చిన్న, పెద్ద పని చేసుకుంటూ ఇంట్లో గలగల మని తిరిగేది...
కానీ కాంతమ్మ గారు ఇవేవీ పడనిచ్చేది కాదు..అసలే నోటి దురుసు మనిషి , అందునా
గయ్యాళి తనంలో phd పట్ట పుచ్చుకుంది...ఏమో
గురునాథం కూడా ఏమి తక్కువ తినలేదు కాంతమ్మకి తిలో పాపం తలో పిడికెడు అని కోడల్ని సాధించడంలో తన వంతు సహాయం బానే చేసేవాడు..
నవ్వుతూ ఉంటే కోడలు "వెధవ వికారాలు మా ఇంట ,వంట లేవు.." అనే వాళ్ళు పోని సౌమ్య తన మాన తాను పని చేసుకుంటూ పోతే..."వెధవ దుమ్మరగుండు మొహం వేసుకొని పొద్దస్తమానం మా మోహన తిరగకపోతే కొంచం నవ్వుతూ ఉండొచ్చు కదా అనే వాళ్ళు."
ఆఖరికి కూర్చున్న తప్పే నిలుచున్న తప్పే...పాపం ఇవన్నీ చూస్తున్న ఉదయ్ కి భార్య మీద చాలా జాలి వేసేది..కానీ తల్లి ని ఎదిరించే ధైర్యం లేదు..
సౌమ్య పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు అయింది..అటు పుట్టింట్లోని తండ్రి వల్ల సుఖం లేదు ఇటు అత్తారింట్లో అదే పరిస్థితి..
ఆఖరికి ఒక రోజు ఉదయ్ తెగించి సౌమ్య తో వేరు కాపురానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
కానీ సౌమ్య ఒప్పుకోలేదు..
"ఉదయ్ నాకు కష్టాలేవి కొత్త కాదు..కానీ పెద్ద వాళ్ళని ఈ వయసులో న స్వార్థం కోసం విడిచి పెట్టి వెళ్ళిపోతే న అంతరాత్మ ఒప్పుకోదు దానికి నేను సమాధానం చెప్పలేను అంది.."
ఇక ఉదయ్ ఆమె మంచితనం ముందు కాదనలేక ఊరుకున్నాడు..
అలా రోజులు గడిచిన కొద్దీ గుండె జబ్బు వల్ల గురునాథం కన్ను మూసాడు..ఇంతట్లో చిన్న వాడు గిరి కూడా పెళ్లి ఈడుకి రావడంతో మొదట నుండి కాంతమ్మ గారు కోరిక మేరకు అందగత్తె, బాగా డబ్బు ఉన్న తన అన్న కూతురు అలేఖ్యని కోడలిగా జేసుకుంది..
అలేఖ్య , కాంతమ్మ గారి అన్నకి ఏకైక సంతానం..చాలా స్థితిమంతులు అవ్వడం, ఒక్కర్తే కూతురు వల్ల అతి గారబం వల్ల అలేఖ్య కి చాలా తల బిరుసు.
ఎవర్ని లెక్క చేసే మనస్తత్వం కాదు. కానీ మేనత్త తనని గారబం చెయ్యడం వల్ల తన ఆటలు బాగా సాగుతాయి అనే ఉద్దేశంతో తండ్రి అడగ్గానే పెళ్లికి సరే నంది.
సహజంగా గయ్యాళి అయిన కాంతమ్మ గురునాథం గారు పోవడం, చిన్న కోడలు తనకు నచ్చిన తన మేనకోడలు కావడం ఆవిడలో అహం పరాకాష్టకు చేరింది..
చిన్న కొడుకు పెళ్లి అవ్వగానే ఆవిడ పెద్ద కొడుకు కోడలితో తెగ తెంపులు చేసుకొని ఆస్తులు అన్ని అమ్ముకొని చిన్న కొడుకు, కోడలితో పాటు చెన్నై వెళ్ళిపోయింది..
ఒక మూడు, నాలుగు సంత్సరాలు అన్ని బాగానే సాగాయి...
రాను రాను ఆవిడ సహజ
గుణం నోటి దురుసు తనం వల్ల ,
అలేఖ్య పొగరు మోత్తనం వల్ల..రాను రాను ఇంట్లో గొడవలు లేని రోజంటు కనిపించలేదు గిరి కి..
ఒకరోజు గిరి, అలేఖ్య నిశ్చయించుకొని కాంతమ్మ గారిని ఒక వృద్ధశ్రమంలో జాయిన్ చేసి వచ్చి ఫార్మాలిటీ కి వాళ్ళ అన్నయ్య ఉదయ్ కి కూడా ఫోన్ ద్వారా తెలియజేేసారు...
అప్పటికే కాంతమ్మ గారు ఆశ్రమానికి వచ్చి మూడు, నాలుగు రోజులవుతోంది..
ఎప్పుడు తన మాటే ఇష్టా రాజ్యాంగ నడిచే ఇంట్లో నుండి వచ్చిన కాంతమ్మకి పాపం నిద్రపట్టలేదు...
కానీ ఆ నాలుగు రోజులు సౌమ్యని తలవని ఘడి అంటూ లేదు..
పాపం ఏమి లాభం బంగారాన్ని కాలదన్ని ఇత్తడి ముక్కని మెడలో వేసుకొని ఊరేగాను.. నాకు కావలసిందే అని తనని తాను తిట్టుకుంది కాంతమ్మ..
ఇలా ఆలోచనలతో సతమవుతున్న కాంతమ్మకి అక్కడ ఆశ్రమం లో పని చేస్తున్న ఆయా వచ్చి " అమ్మ మిమ్మల్ని కలవడానికి ఆఫీస్ రూమ్ లో ఎవరో వైట్ చేస్తున్నారు రండి" అని చెప్పగానే కాంతమ్మ తన చిన్న, కొడుకు కోడలు వచ్చారేమో అని హడావిడిగా ఆమెతో బయలుదేరి ఆఫీస్ రూమ్ దగ్గరకు చేరుకుంది..
అక్కడ వచ్చిన వాళ్ళని చూసి కాంతమ్మ మొహంలో కత్తి వాటుకి నెత్తురు చుక్క లేదు అలా కొయ్యబారి ఉండిపోయింది...
అది చూసి ఆ వచ్చిన ఆమె కాంతమ్మ దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకొని అత్తయ్య ఎందుకిలా చేసేరు మేము జ్ఞ్యాపకము రాలేదా అని ఆత్మీయంగా అడిగింది...
ఆమె సౌమ్య , కాంతమ్మ పెద్ద కోడలు..
కాంతమ్మ , సౌమ్య కళ్లల్లో ఒక్క మారు చూసి కళ్ళు దించుకొని సౌమ్య చేతుల్ని తన చేతిలో తీసుకుంది..కాంతమ్మ కళ్ళలో
పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు అచేతనంగా సౌమ్య చేతుల మీద పడ్డాయి..
కాంతమ్మ చూపుల్లో అనేక భావాలు సౌమ్య మనసుని కదిల్చివేశాయి...
కాంతమ్మ భుజం మీద చేతులు వేస్తూ ఆప్యాయంగా ఆమెని తనతో కూడా కార్ దగ్గరకు తీసుకు వెళ్తూ నడుస్తూ ఉంటే కాంతమ్మ కళ్లల్లో ఒకటే ప్రశ్న ఇన్ని చేసిన నన్ను ఎందుకు క్షమించావు సౌమ్య అని..
దానికి అర్థం అయినట్టు సమాధానంగా సౌమ్య చెప్పింది
* అత్తయ్య నేను లోకానికి ఏమి సమాధానం చెప్పాలని కాదు మీరు వృథాశ్రమంలో ఉన్నారని తెలిసిన దగ్గరనుండి నా అంతరాత్మకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్న...
నా ఎదుట నేనే తల ఎత్తుకోలేక పోతున్న *
దయ చేసి మాతో వచ్చేయండి న అంతరాత్మ ముందు నన్ను దోషిగా నిలబెట్టి కండి అని వినయంగా చేతులు జోడించింది సౌమ్య...
మనుషుల్లో ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అని కాంతమ్మ
నిర్ఘాంతపోయింది...
ఉదయ్ భార్య వంక గర్వంగా చూసి మురిసిపోయాడు..
అంతరాత్మని నమ్మే వాడు ఏ తప్పు చెయ్యలేడని నా నమ్మకం కూడా...మరి మీరేమంటారు??😊
రేణుక సుసర్ల

ఇల్లాలు

మనసులో రేగే
కొత్త పులకింతకలు,
మదిలోన దాగే ,
ఎన్నేన్నో సందేహాలు,
అయిన వాళ్ళని విడిచి ,
ఉన్న ఇంటిపేరు మార్చి,
మనువాడిన వాడి వెంట,
అపారమైన నమ్మకంతో,
నడిచొచ్చిన ఘనత ,
ఆమెదే.....
తన కొత్త ప్రపంచంలో,
తనదైన వాటిని అన్ని వదులుకొని ,
నీతో ఇల్లు అనే ,
ప్రపంచాన్ని నిర్మిస్తుంది.
ఆమె.....
తన ప్రాణనికి సైతం,
లెక్క చేయక ,
నీ బిడ్డకి జన్మ నిచ్చి ,
తన జన్మని సార్ధకం చేసుకుంటుంది ఆమె....
ప్రేమ, త్యాగం,
ఓర్పు, నేర్పు
అన్నింటితో
తన దైన శైలిలో,
ఒక సంతోష కుటుంబాన్ని, నిర్మిస్తుంది ఆమె....
ఆమె
నీకు ఒక స్నేహితురాలు,
ప్రేయసి, ఒక తల్లి,
అన్నిటికి మించి
తన ఇష్ట ఇష్టాలని
తన వారికోసం త్యాగం చేసిన త్యాగశీలి...ఆమె
మన ప్రతి ఇంట
వెలసిన స్త్రీ మూర్తి
ఆమె ఒక ఇల్లాలు🙏
రేణుక సుసర్ల

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...