21, మే 2017, ఆదివారం

అమృతమూర్తి ఐన అమ్మకు నమస్సుమాంజలి

అమ్మ!
దేముడు సృష్టించిన
తీయని పదం.
తను!
మాట్లాడే ప్రతి పలుకు
నాలో ప్రతిబబించిన
ఒక వెలుగు.
తను!
చెప్పిన ప్రతిమాట నేర్పే
ఒక జీవిత సత్యం.
తను!
ఇచ్చే ఓదార్పు
నా మనసుకు
చేకూర్చే చల్లని సేద.
తను!
ఇచ్చిన ప్రతి సలహా,
నా ప్రగతికి తొలి మెట్టు.
తను!
నాతో వేసిన ప్రతి అడుగు,
నాలో ఊపిరి పోసిన ధైర్యం.
తన మాట, పలుకు, ఓదార్పు అన్ని ఏకమై నాలో
ఇనుమడించిన సంపూర్ణ వ్యక్తిత్వం.
అమ్మా! జన్మ నిచ్చిన తల్లివై నన్ను లాలించావు!
తండ్రిలా నన్ను ప్రేమించావు,
నేస్తమై కష్టాల్లో
నాకు ధైర్యాన్ని ఇచ్చావు .
గురువు వై నాలో
జ్ఞ్యానాన్ని పెంపొందించావు.
ఇన్ని ఇచ్చిన నిన్ను
నేను ఏ నాటికి మరువలేను...
ప్రేమతో నీ చంటి ( రేణుక).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...