31, మే 2017, బుధవారం

ఒంటరి

గోధూళి వేళ
పశు పక్ష్యాదులు
సద్దుమణిగి గూటికి
చేరేసమాయన్న...
సన్నగా చీకట్లు
అలుముకునే ఘడియ...
ఒక ఆదరించే మనసు
తన మనసు పడే
వేదనను , ఆనందాన్ని
పంచుకునేందుకు
నేస్తం కోసం
ఎదురు చూసింది...
కానీ
యాంత్రిక జీవితం,
పరుగిలిడుతున్న
సమయం..
కొట్టు మిట్టాడుతున్న
జీవితాల్లో
తీరిక ఎవరికి...?
సమయం
ఎక్కడిది..?
తోడుకోసం మనసు
ఆరటపడిన
కానరాని నేస్తాలు...
సమయాన్ని తన
చేతలతో చూపిస్తున్న
గడియారం
ముల్లు ల ముచ్చట్లు...
కప్పలు, కీచురాళ్ల
పిలుపులు...
వీధి కుక్కల
పలకరింపులు...
వీచే గాలి కబుర్లు..
ఆ కబుర్లకు ఉలిక్కిపడి
నేల రాలిన
ఆకుల సవ్వళ్లే
ఇక నా స్నేహితులు,
సన్నిహితులు.
ఒంటరితనం
ముసుగులో
ఉన్న నాకు
ఇంతమంది
నేస్తలున్నారని
ఇప్పుడే తెలిసింది...
రేణుక సుసర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...