అంతరాత్మ...
అమ్మ! చివరిగా చెప్తున్న నేను పెళ్లి అంటూ చేసుకుంటే సౌమ్య నే చేసుకుంటే లేకపోతే అజన్మ బ్రాహ్మచారిగా ఉండిపోత ఆ పైన మీ ఇష్టం అని ఉదయ్,ఢంకా మీద కొట్టి మరీ చెప్పాడు కాంతమ్మ కి గురునాథం గారికి.
ఉదయ్, సౌమ్యని ఒక చుట్టాల ఇంట్లో పెళ్లిలో చూసి మనసు పారేసుకున్నాడు...
ఆ అమ్మాయి గురించి అన్ని enquiry చేసి అంత మంచి అమ్మాయి జీవిత భాగస్వామి అవుతే చాలని పగలు, రాత్రి వెయ్యి దేముళ్ళకి మొక్కకున్నాడు ఉదయ్.
దేముడి వర మిచ్చిన పూజారి వరమివ్వడని కాంతమ్మ పంతం పెట్టి కూర్చుంది..ససేమిరా ఆపిల్ల ఇంటికి కోడలిగా వద్దని.
కాంతమ్మ, గురునాథం దపంతులకి ఇద్దరు కుమారులు...పెద్ద వాడు ఉదయ్ Income టాక్స్ ఆఫీసర్...
రెండవ వాడు గిరి చెన్నై లో software ఉద్యోగి..
కాంతమ్మకి అదే బడాయి.. తన కొడుకులిద్దరు పెద్ద positionలో ఉన్నారు కనుక ఏ రంభో, ఉర్వసో... కోడలిగా రావాలి బాగా డబ్బు ఉన్న అమ్మాయి అయి ఉండాలి అని సగటు ఆడవాళ్లలాగే కోరుకుంది.
ఆ కోరిక బాగా ఆవిడ మనసులో రాచ పుండులా తయారైంది ...
ఇలాగే కాంతమ్మ తన తమ్ముడి పెళ్లి పెత్తనం, ఇంటికి పెద్దది కదా
అని అప్పచెప్తే నాన వంకలు పెట్టి పాపం షష్టి పూర్తి అయిన కూడా అతగాడికి పెళ్లి అవ్వనివ్వలేదు..
కాంతమ్మ అన్నకి మాత్రం ఈవిడ కంటే ముందు పెళ్ళిఅవ్వడం వల్ల బతికిపోయాడు..ఇద్దరు అన్న, తమ్ములకి ఈవిడ ఒక్కర్తే ఆడబిడ్డ...అందుకే ఈవిడంటే అన్న, తమ్ములకి బాగా ముద్దు...
బావమరిది పెళ్లి పెటాకులు లేకపోడానికి కాంతమ్మ గారే కారకురాలు కనక గురునాథం కంగారు పడి నానా తంటాలు పడి నయానో, భయానో కాంతమ్మని కొడుకు పెళ్లికి ఒప్పించాడు. గురునాధానికి కూడా గుండె జబ్బు ఉండడం వల్ల కాంతమ్మ మరీ మొండి పట్టు పట్టక ఎలాగో ఒకలాగ ముక్కుతూ , మూలుగుతూ సరే నంది.
మొత్తం మీద పెళ్లి అయి సౌమ్య కాపురానికి అత్తగారింటికి రానే వచ్చింది..
పాపం సౌమ్య పేరుకు తగట్టు చాలా నెమ్మదస్తురాలు..ఆమెకి తల్లి అన్నపూర్ణమ్మ పోలిక. తండ్రి సుబ్బారావు మాత్రం కాలంతకుడు..
అన్నపూర్ణమ్మకి అందరూ ఆడపిల్లలు కావడం పెళ్ళాం, పిల్లల్ని సుబ్బారావు లెక్క చేసేవాడు కాదు...
సహజంగా బుద్దిమంతురాలు, ఇంటికి పెద్దది ఇంట్లో పరిస్థితుల వల్ల కూడా సౌమ్య బాగా సద్దుకుపోయే మనస్తత్వం గల పిల్ల.
సౌమ్య వచ్చిరావడంతో అందరి ఇష్ట ఇష్టాలు తెలుసుకొని బాగా కలివిడిగా ఉంటూ, చిన్న, పెద్ద పని చేసుకుంటూ ఇంట్లో గలగల మని తిరిగేది...
కానీ కాంతమ్మ గారు ఇవేవీ పడనిచ్చేది కాదు..అసలే నోటి దురుసు మనిషి , అందునా
గయ్యాళి తనంలో phd పట్ట పుచ్చుకుంది...ఏమో
గురునాథం కూడా ఏమి తక్కువ తినలేదు కాంతమ్మకి తిలో పాపం తలో పిడికెడు అని కోడల్ని సాధించడంలో తన వంతు సహాయం బానే చేసేవాడు..
నవ్వుతూ ఉంటే కోడలు "వెధవ వికారాలు మా ఇంట ,వంట లేవు.." అనే వాళ్ళు పోని సౌమ్య తన మాన తాను పని చేసుకుంటూ పోతే..."వెధవ దుమ్మరగుండు మొహం వేసుకొని పొద్దస్తమానం మా మోహన తిరగకపోతే కొంచం నవ్వుతూ ఉండొచ్చు కదా అనే వాళ్ళు."
ఆఖరికి కూర్చున్న తప్పే నిలుచున్న తప్పే...పాపం ఇవన్నీ చూస్తున్న ఉదయ్ కి భార్య మీద చాలా జాలి వేసేది..కానీ తల్లి ని ఎదిరించే ధైర్యం లేదు..
సౌమ్య పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు అయింది..అటు పుట్టింట్లోని తండ్రి వల్ల సుఖం లేదు ఇటు అత్తారింట్లో అదే పరిస్థితి..
ఆఖరికి ఒక రోజు ఉదయ్ తెగించి సౌమ్య తో వేరు కాపురానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
కానీ సౌమ్య ఒప్పుకోలేదు..
"ఉదయ్ నాకు కష్టాలేవి కొత్త కాదు..కానీ పెద్ద వాళ్ళని ఈ వయసులో న స్వార్థం కోసం విడిచి పెట్టి వెళ్ళిపోతే న అంతరాత్మ ఒప్పుకోదు దానికి నేను సమాధానం చెప్పలేను అంది.."
ఇక ఉదయ్ ఆమె మంచితనం ముందు కాదనలేక ఊరుకున్నాడు..
అలా రోజులు గడిచిన కొద్దీ గుండె జబ్బు వల్ల గురునాథం కన్ను మూసాడు..ఇంతట్లో చిన్న వాడు గిరి కూడా పెళ్లి ఈడుకి రావడంతో మొదట నుండి కాంతమ్మ గారు కోరిక మేరకు అందగత్తె, బాగా డబ్బు ఉన్న తన అన్న కూతురు అలేఖ్యని కోడలిగా జేసుకుంది..
అలేఖ్య , కాంతమ్మ గారి అన్నకి ఏకైక సంతానం..చాలా స్థితిమంతులు అవ్వడం, ఒక్కర్తే కూతురు వల్ల అతి గారబం వల్ల అలేఖ్య కి చాలా తల బిరుసు.
ఎవర్ని లెక్క చేసే మనస్తత్వం కాదు. కానీ మేనత్త తనని గారబం చెయ్యడం వల్ల తన ఆటలు బాగా సాగుతాయి అనే ఉద్దేశంతో తండ్రి అడగ్గానే పెళ్లికి సరే నంది.
సహజంగా గయ్యాళి అయిన కాంతమ్మ గురునాథం గారు పోవడం, చిన్న కోడలు తనకు నచ్చిన తన మేనకోడలు కావడం ఆవిడలో అహం పరాకాష్టకు చేరింది..
చిన్న కొడుకు పెళ్లి అవ్వగానే ఆవిడ పెద్ద కొడుకు కోడలితో తెగ తెంపులు చేసుకొని ఆస్తులు అన్ని అమ్ముకొని చిన్న కొడుకు, కోడలితో పాటు చెన్నై వెళ్ళిపోయింది..
ఒక మూడు, నాలుగు సంత్సరాలు అన్ని బాగానే సాగాయి...
రాను రాను ఆవిడ సహజ
గుణం నోటి దురుసు తనం వల్ల ,
అలేఖ్య పొగరు మోత్తనం వల్ల..రాను రాను ఇంట్లో గొడవలు లేని రోజంటు కనిపించలేదు గిరి కి..
ఒకరోజు గిరి, అలేఖ్య నిశ్చయించుకొని కాంతమ్మ గారిని ఒక వృద్ధశ్రమంలో జాయిన్ చేసి వచ్చి ఫార్మాలిటీ కి వాళ్ళ అన్నయ్య ఉదయ్ కి కూడా ఫోన్ ద్వారా తెలియజేేసారు...
అప్పటికే కాంతమ్మ గారు ఆశ్రమానికి వచ్చి మూడు, నాలుగు రోజులవుతోంది..
ఎప్పుడు తన మాటే ఇష్టా రాజ్యాంగ నడిచే ఇంట్లో నుండి వచ్చిన కాంతమ్మకి పాపం నిద్రపట్టలేదు...
కానీ ఆ నాలుగు రోజులు సౌమ్యని తలవని ఘడి అంటూ లేదు..
పాపం ఏమి లాభం బంగారాన్ని కాలదన్ని ఇత్తడి ముక్కని మెడలో వేసుకొని ఊరేగాను.. నాకు కావలసిందే అని తనని తాను తిట్టుకుంది కాంతమ్మ..
ఇలా ఆలోచనలతో సతమవుతున్న కాంతమ్మకి అక్కడ ఆశ్రమం లో పని చేస్తున్న ఆయా వచ్చి " అమ్మ మిమ్మల్ని కలవడానికి ఆఫీస్ రూమ్ లో ఎవరో వైట్ చేస్తున్నారు రండి" అని చెప్పగానే కాంతమ్మ తన చిన్న, కొడుకు కోడలు వచ్చారేమో అని హడావిడిగా ఆమెతో బయలుదేరి ఆఫీస్ రూమ్ దగ్గరకు చేరుకుంది..
అక్కడ వచ్చిన వాళ్ళని చూసి కాంతమ్మ మొహంలో కత్తి వాటుకి నెత్తురు చుక్క లేదు అలా కొయ్యబారి ఉండిపోయింది...
అది చూసి ఆ వచ్చిన ఆమె కాంతమ్మ దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకొని అత్తయ్య ఎందుకిలా చేసేరు మేము జ్ఞ్యాపకము రాలేదా అని ఆత్మీయంగా అడిగింది...
ఆమె సౌమ్య , కాంతమ్మ పెద్ద కోడలు..
కాంతమ్మ , సౌమ్య కళ్లల్లో ఒక్క మారు చూసి కళ్ళు దించుకొని సౌమ్య చేతుల్ని తన చేతిలో తీసుకుంది..కాంతమ్మ కళ్ళలో
పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు అచేతనంగా సౌమ్య చేతుల మీద పడ్డాయి..
కాంతమ్మ చూపుల్లో అనేక భావాలు సౌమ్య మనసుని కదిల్చివేశాయి...
కాంతమ్మ భుజం మీద చేతులు వేస్తూ ఆప్యాయంగా ఆమెని తనతో కూడా కార్ దగ్గరకు తీసుకు వెళ్తూ నడుస్తూ ఉంటే కాంతమ్మ కళ్లల్లో ఒకటే ప్రశ్న ఇన్ని చేసిన నన్ను ఎందుకు క్షమించావు సౌమ్య అని..
దానికి అర్థం అయినట్టు సమాధానంగా సౌమ్య చెప్పింది
* అత్తయ్య నేను లోకానికి ఏమి సమాధానం చెప్పాలని కాదు మీరు వృథాశ్రమంలో ఉన్నారని తెలిసిన దగ్గరనుండి నా అంతరాత్మకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్న...
నా ఎదుట నేనే తల ఎత్తుకోలేక పోతున్న *
దయ చేసి మాతో వచ్చేయండి న అంతరాత్మ ముందు నన్ను దోషిగా నిలబెట్టి కండి అని వినయంగా చేతులు జోడించింది సౌమ్య...
మనుషుల్లో ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అని కాంతమ్మ
నిర్ఘాంతపోయింది...
ఉదయ్ భార్య వంక గర్వంగా చూసి మురిసిపోయాడు..
అంతరాత్మని నమ్మే వాడు ఏ తప్పు చెయ్యలేడని నా నమ్మకం కూడా...మరి మీరేమంటారు??😊
రేణుక సుసర్ల