7, మే 2017, ఆదివారం

ఓ కార్మికుడా!

చుక్క చుక్క నేల కొరిగి చెమటోడ్చినోడా
ఓ కార్మికుడ
నీకు నా సలాం..
రాయి, రాయి పేర్చి కట్టు భవనాల సొగసు కష్టం నీదేర
ఎండ లేదు, వాన లేదు
సమయానికి తిండి లేదు
ఓ కార్మికుడా!
కష్టమంత నీదేరా...
కండ బలం చూపించి
కొండని సైతం పిండిచేసి
పగలనక, రేయనక
రహదారులు వేసినోడ..
ఓ కార్మికుడా!
కష్ట మంత నీదేరా....
భార్య బిడ్డల్ని
సైతం వదిలిపెట్టి,
ఉన్న ఊరు విడిచిపెట్టి ,
ఊరు కానీ ఊరులో ,
అయిన వాళ్ళు లేని చోట ,
బతుకు బండి నీవు ఈడ్చేర
ఓ కార్మికుడా!
కష్టమంత నీదేరా.....
మేడ, మిద్దలైన కానీ,
రహదారులైతే నేమి,
ఫ్యాక్టరీలు, కంపెనీలు,
పాడి, పంట అయిన నేమి,
తొడిగిన చెప్పు, కట్టిన బట్ట,
ఏరిన చెత్త, ఏది అయిన
ఏమి కానీ
కష్ట మన్నది నీదేర..
మా సుఖం కోసం ,
కష్ట పడ్డది నీవేర ...
ఓ కార్మికుడా!
మండే ఎండలో
ఎన్డే గుండెతో
చేసే కష్టం, వచ్చే నష్టం
లెక్క సేయనోడివిరా!!!
ఓ కార్మికుడా నీకు నా సలాం
ఓ అన్న నీకు నా ప్రనామ్🙏
రేణుక సుసర్ల

బతుకు బండి

బతుకు బండి పోరాటం
సగటు మనిషి ఆరాటం
అసలే
అర కొర జీతాలు,
పెనవేసుకున్న బంధాలు,
బాధ్యతల సంకెళ్లు,
చేతికందని సంతానం,
వృధాప్యంలో ఉన్న, తల్లితండ్రులు.
కొలిక్కిరాని సమస్యలు
ఉక్కిరిబిక్కిరి అవుతున్న
నా ఈ జీవితం.
దగ్గర పడ్డ ,
పదవీ విరమణ వయస్సు.
ఈ సమయములో
సమస్యల ఊబి నుండి ,
నన్ను లాగేదెవరు?
అక్కున చేర్చుకునేదెవరు?
తోడు నిలిచేదెవరు?
వెలుగు నింపేదెవరు?
నా సమస్యలకి ,
పరిష్కారమే లేదా!
ఈ బాధ్యతల ,
సంద్రము నుండి ,
ఒడ్డుకి చేరనేలేన?
అని ....🤔
ఆలోచనల వలయంలో కొట్టుమిట్టాడుతోంది
నా ఈ దీన హృదయం...
ఒక చిరు ఉద్యోగి ఆవేదన😢
రేణుక సుసర్ల

అనుభూతి

ఎప్పుడో ఎక్కడో ,
పోగొట్టుకున్న ,
'నన్ను'
ఈ కాగితాల్లోనే రోజూ,
వెతుకుతూ ఉంటాను...
అనంతాలలో పారేసుకున్న,
అనుభూతుల వెచ్చదనాన్ని,
ఈ కాగితాల్లోనే దాచుకుని,
నిత్యం తడుముతూ ఉంటాను....
ఎన్నో ఆశలు,
ఎన్నో ఆశయాలు
ఎన్నో ఆదర్శాల ఆవేశాలు
ఈ కాగితాల్లోనే
రెప రెపలాడాయి.....
ఎన్నో కలలు కన్నీరై
ఎన్నో ప్రేమలు స్మృతిగీతాలై
ఈ కాగితాల్లోనే ఇంకుచుక్కలై ఇంకిపోయాయి.....
రాయాలని ఉన్న రాయలేక
రాయకుండా వుండలేక,
పూటపూటకి ,
ఎన్నోపురిటి నెప్పులు...
ఈకాగితాల్లోనే ,
పూర్తికాకుండా ,
నిలిచిపోయాయి....
కలకాలం నిలువలేక,
కలిసి నాతో రాలేక,
కదిలిపోయిన,
వసంతాలెన్నో,
ఈ కాగితాల్లోనే ,
పూలరెక్కలయి ,
మిగిలి పోయాయి....
ఎప్పుడో ఎక్కడో
పోగొట్టుకున్న 'నన్ను'
ఈ కాగితాల్లోనే రోజూ
వెతుకుతూ ఉంటాను.
అందుకే ఎదలోని ,
ఎగిసే భావోద్గ్వేగాన్ని,
అక్షర రూపంలో ,
ఈ కాగితాల్లో ,
పేరుస్తూ ఉంటాను....
రేణుక సుసర్ల

ప్రేమ

కార్చేది ఎప్ఫడు కన్నీరే
చిరునవ్వు మాత్రం సింగారించుకున్నది
మాట లేకున్నా మవునమే చాలనుకున్న..
ప్రేమ లేకున్నా తిరస్కారమే ముద్దనుకున్న..
హృదయము పాషణమని తెలిసిన 
శిల్పంగా మరల్చుకుందా మనకున్న....
ఆవేదన ని కూడా నైవేద్యంలా స్వీకరించా...
నీ నిర్లక్షం లో కూడా ప్రేమని వెతుకు తున్న ఓ నేస్తం
శుభోదయం
రేణుక సుసర్ల.

నేను ఎవరిని?

నేను ఎవరిని?
సహనం,ఓర్పు
అలంకారంగా తొడుకున్న
శాంతి దూతన
లేక,
అభిమానం, అనురాగం దుప్పటిగా కప్పుకున్న ఆత్మీయురాలిన
లేక,
అణువణువున
ఉరకలేసిన ఆవేశంతో ఉర్రుతలూగిన
నారిమణినా..?
నేను ఎవరిని..?
అక్కున చేర్చుకుని
కమ్మనైన అమ్మతనం
చూపించే మాతృమూర్తినా
లేక,
అడుగడుగు నా స్నేహ
హస్తం అందించే
స్నేహితురాలిన
లేక,
మనువాడిన వాడి
మనసున కొలువై ఉన్న
మగువకు ప్రేరణనా..?
నేను ఎవరిని..?
అందరూ నా హితులు, సన్నిహితులు అనుకొని
నమ్మే మూగ జీవినా
లేక,
ఎన్ని మార్లు మోసపోయిన
తిరిగి నమ్మే
ఆశవాదిన
లేక ,
మంచితనాన్నే నమ్మే
సిద్ధాంత వాదినా..?
ఎవరిని నేను ఎవరిని...?
ఎవరినైనా ఏమైనా...
ఈ పయనం ఆగనిది...
ఈ ఆరాటం మారనిది...
గమ్యం ఎటో తెలియని...
జీవితపు రహదారిలో ...
అలుపు ఎరగకుండా ...
నిర్మలమైన మనస్సుతో...
చిరు దరహాసంతో...
స్నేహ భావంతో...
ముందుగు సాగిపోతూనే
ఉన్న నేను ***
అందరికి
ఆత్మబంధువిని....😊
రేణుక సుసర్ల

అంతరాత్మ...

అంతరాత్మ...

అమ్మ! చివరిగా చెప్తున్న నేను పెళ్లి అంటూ చేసుకుంటే సౌమ్య నే చేసుకుంటే లేకపోతే అజన్మ బ్రాహ్మచారిగా ఉండిపోత ఆ పైన మీ ఇష్టం అని ఉదయ్,ఢంకా మీద కొట్టి మరీ చెప్పాడు కాంతమ్మ కి గురునాథం గారికి.
ఉదయ్, సౌమ్యని ఒక చుట్టాల ఇంట్లో పెళ్లిలో చూసి మనసు పారేసుకున్నాడు...
ఆ అమ్మాయి గురించి అన్ని enquiry చేసి అంత మంచి అమ్మాయి జీవిత భాగస్వామి అవుతే చాలని పగలు, రాత్రి వెయ్యి దేముళ్ళకి మొక్కకున్నాడు ఉదయ్.
దేముడి వర మిచ్చిన పూజారి వరమివ్వడని కాంతమ్మ పంతం పెట్టి కూర్చుంది..ససేమిరా ఆపిల్ల ఇంటికి కోడలిగా వద్దని.
కాంతమ్మ, గురునాథం దపంతులకి ఇద్దరు కుమారులు...పెద్ద వాడు ఉదయ్ Income టాక్స్ ఆఫీసర్...
రెండవ వాడు గిరి చెన్నై లో software ఉద్యోగి..
కాంతమ్మకి అదే బడాయి.. తన కొడుకులిద్దరు పెద్ద positionలో ఉన్నారు కనుక ఏ రంభో, ఉర్వసో... కోడలిగా రావాలి బాగా డబ్బు ఉన్న అమ్మాయి అయి ఉండాలి అని సగటు ఆడవాళ్లలాగే కోరుకుంది.
ఆ కోరిక బాగా ఆవిడ మనసులో రాచ పుండులా తయారైంది ...
ఇలాగే కాంతమ్మ తన తమ్ముడి పెళ్లి పెత్తనం, ఇంటికి పెద్దది కదా
అని అప్పచెప్తే నాన వంకలు పెట్టి పాపం షష్టి పూర్తి అయిన కూడా అతగాడికి పెళ్లి అవ్వనివ్వలేదు..
కాంతమ్మ అన్నకి మాత్రం ఈవిడ కంటే ముందు పెళ్ళిఅవ్వడం వల్ల బతికిపోయాడు..ఇద్దరు అన్న, తమ్ములకి ఈవిడ ఒక్కర్తే ఆడబిడ్డ...అందుకే ఈవిడంటే అన్న, తమ్ములకి బాగా ముద్దు...
బావమరిది పెళ్లి పెటాకులు లేకపోడానికి కాంతమ్మ గారే కారకురాలు కనక గురునాథం కంగారు పడి నానా తంటాలు పడి నయానో, భయానో కాంతమ్మని కొడుకు పెళ్లికి ఒప్పించాడు. గురునాధానికి కూడా గుండె జబ్బు ఉండడం వల్ల కాంతమ్మ మరీ మొండి పట్టు పట్టక ఎలాగో ఒకలాగ ముక్కుతూ , మూలుగుతూ సరే నంది.
మొత్తం మీద పెళ్లి అయి సౌమ్య కాపురానికి అత్తగారింటికి రానే వచ్చింది..
పాపం సౌమ్య పేరుకు తగట్టు చాలా నెమ్మదస్తురాలు..ఆమెకి తల్లి అన్నపూర్ణమ్మ పోలిక. తండ్రి సుబ్బారావు మాత్రం కాలంతకుడు..
అన్నపూర్ణమ్మకి అందరూ ఆడపిల్లలు కావడం పెళ్ళాం, పిల్లల్ని సుబ్బారావు లెక్క చేసేవాడు కాదు...
సహజంగా బుద్దిమంతురాలు, ఇంటికి పెద్దది ఇంట్లో పరిస్థితుల వల్ల కూడా సౌమ్య బాగా సద్దుకుపోయే మనస్తత్వం గల పిల్ల.
సౌమ్య వచ్చిరావడంతో అందరి ఇష్ట ఇష్టాలు తెలుసుకొని బాగా కలివిడిగా ఉంటూ, చిన్న, పెద్ద పని చేసుకుంటూ ఇంట్లో గలగల మని తిరిగేది...
కానీ కాంతమ్మ గారు ఇవేవీ పడనిచ్చేది కాదు..అసలే నోటి దురుసు మనిషి , అందునా
గయ్యాళి తనంలో phd పట్ట పుచ్చుకుంది...ఏమో
గురునాథం కూడా ఏమి తక్కువ తినలేదు కాంతమ్మకి తిలో పాపం తలో పిడికెడు అని కోడల్ని సాధించడంలో తన వంతు సహాయం బానే చేసేవాడు..
నవ్వుతూ ఉంటే కోడలు "వెధవ వికారాలు మా ఇంట ,వంట లేవు.." అనే వాళ్ళు పోని సౌమ్య తన మాన తాను పని చేసుకుంటూ పోతే..."వెధవ దుమ్మరగుండు మొహం వేసుకొని పొద్దస్తమానం మా మోహన తిరగకపోతే కొంచం నవ్వుతూ ఉండొచ్చు కదా అనే వాళ్ళు."
ఆఖరికి కూర్చున్న తప్పే నిలుచున్న తప్పే...పాపం ఇవన్నీ చూస్తున్న ఉదయ్ కి భార్య మీద చాలా జాలి వేసేది..కానీ తల్లి ని ఎదిరించే ధైర్యం లేదు..
సౌమ్య పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు అయింది..అటు పుట్టింట్లోని తండ్రి వల్ల సుఖం లేదు ఇటు అత్తారింట్లో అదే పరిస్థితి..
ఆఖరికి ఒక రోజు ఉదయ్ తెగించి సౌమ్య తో వేరు కాపురానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
కానీ సౌమ్య ఒప్పుకోలేదు..
"ఉదయ్ నాకు కష్టాలేవి కొత్త కాదు..కానీ పెద్ద వాళ్ళని ఈ వయసులో న స్వార్థం కోసం విడిచి పెట్టి వెళ్ళిపోతే న అంతరాత్మ ఒప్పుకోదు దానికి నేను సమాధానం చెప్పలేను అంది.."
ఇక ఉదయ్ ఆమె మంచితనం ముందు కాదనలేక ఊరుకున్నాడు..
అలా రోజులు గడిచిన కొద్దీ గుండె జబ్బు వల్ల గురునాథం కన్ను మూసాడు..ఇంతట్లో చిన్న వాడు గిరి కూడా పెళ్లి ఈడుకి రావడంతో మొదట నుండి కాంతమ్మ గారు కోరిక మేరకు అందగత్తె, బాగా డబ్బు ఉన్న తన అన్న కూతురు అలేఖ్యని కోడలిగా జేసుకుంది..
అలేఖ్య , కాంతమ్మ గారి అన్నకి ఏకైక సంతానం..చాలా స్థితిమంతులు అవ్వడం, ఒక్కర్తే కూతురు వల్ల అతి గారబం వల్ల అలేఖ్య కి చాలా తల బిరుసు.
ఎవర్ని లెక్క చేసే మనస్తత్వం కాదు. కానీ మేనత్త తనని గారబం చెయ్యడం వల్ల తన ఆటలు బాగా సాగుతాయి అనే ఉద్దేశంతో తండ్రి అడగ్గానే పెళ్లికి సరే నంది.
సహజంగా గయ్యాళి అయిన కాంతమ్మ గురునాథం గారు పోవడం, చిన్న కోడలు తనకు నచ్చిన తన మేనకోడలు కావడం ఆవిడలో అహం పరాకాష్టకు చేరింది..
చిన్న కొడుకు పెళ్లి అవ్వగానే ఆవిడ పెద్ద కొడుకు కోడలితో తెగ తెంపులు చేసుకొని ఆస్తులు అన్ని అమ్ముకొని చిన్న కొడుకు, కోడలితో పాటు చెన్నై వెళ్ళిపోయింది..
ఒక మూడు, నాలుగు సంత్సరాలు అన్ని బాగానే సాగాయి...
రాను రాను ఆవిడ సహజ
గుణం నోటి దురుసు తనం వల్ల ,
అలేఖ్య పొగరు మోత్తనం వల్ల..రాను రాను ఇంట్లో గొడవలు లేని రోజంటు కనిపించలేదు గిరి కి..
ఒకరోజు గిరి, అలేఖ్య నిశ్చయించుకొని కాంతమ్మ గారిని ఒక వృద్ధశ్రమంలో జాయిన్ చేసి వచ్చి ఫార్మాలిటీ కి వాళ్ళ అన్నయ్య ఉదయ్ కి కూడా ఫోన్ ద్వారా తెలియజేేసారు...
అప్పటికే కాంతమ్మ గారు ఆశ్రమానికి వచ్చి మూడు, నాలుగు రోజులవుతోంది..
ఎప్పుడు తన మాటే ఇష్టా రాజ్యాంగ నడిచే ఇంట్లో నుండి వచ్చిన కాంతమ్మకి పాపం నిద్రపట్టలేదు...
కానీ ఆ నాలుగు రోజులు సౌమ్యని తలవని ఘడి అంటూ లేదు..
పాపం ఏమి లాభం బంగారాన్ని కాలదన్ని ఇత్తడి ముక్కని మెడలో వేసుకొని ఊరేగాను.. నాకు కావలసిందే అని తనని తాను తిట్టుకుంది కాంతమ్మ..
ఇలా ఆలోచనలతో సతమవుతున్న కాంతమ్మకి అక్కడ ఆశ్రమం లో పని చేస్తున్న ఆయా వచ్చి " అమ్మ మిమ్మల్ని కలవడానికి ఆఫీస్ రూమ్ లో ఎవరో వైట్ చేస్తున్నారు రండి" అని చెప్పగానే కాంతమ్మ తన చిన్న, కొడుకు కోడలు వచ్చారేమో అని హడావిడిగా ఆమెతో బయలుదేరి ఆఫీస్ రూమ్ దగ్గరకు చేరుకుంది..
అక్కడ వచ్చిన వాళ్ళని చూసి కాంతమ్మ మొహంలో కత్తి వాటుకి నెత్తురు చుక్క లేదు అలా కొయ్యబారి ఉండిపోయింది...
అది చూసి ఆ వచ్చిన ఆమె కాంతమ్మ దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకొని అత్తయ్య ఎందుకిలా చేసేరు మేము జ్ఞ్యాపకము రాలేదా అని ఆత్మీయంగా అడిగింది...
ఆమె సౌమ్య , కాంతమ్మ పెద్ద కోడలు..
కాంతమ్మ , సౌమ్య కళ్లల్లో ఒక్క మారు చూసి కళ్ళు దించుకొని సౌమ్య చేతుల్ని తన చేతిలో తీసుకుంది..కాంతమ్మ కళ్ళలో
పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు అచేతనంగా సౌమ్య చేతుల మీద పడ్డాయి..
కాంతమ్మ చూపుల్లో అనేక భావాలు సౌమ్య మనసుని కదిల్చివేశాయి...
కాంతమ్మ భుజం మీద చేతులు వేస్తూ ఆప్యాయంగా ఆమెని తనతో కూడా కార్ దగ్గరకు తీసుకు వెళ్తూ నడుస్తూ ఉంటే కాంతమ్మ కళ్లల్లో ఒకటే ప్రశ్న ఇన్ని చేసిన నన్ను ఎందుకు క్షమించావు సౌమ్య అని..
దానికి అర్థం అయినట్టు సమాధానంగా సౌమ్య చెప్పింది
* అత్తయ్య నేను లోకానికి ఏమి సమాధానం చెప్పాలని కాదు మీరు వృథాశ్రమంలో ఉన్నారని తెలిసిన దగ్గరనుండి నా అంతరాత్మకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్న...
నా ఎదుట నేనే తల ఎత్తుకోలేక పోతున్న *
దయ చేసి మాతో వచ్చేయండి న అంతరాత్మ ముందు నన్ను దోషిగా నిలబెట్టి కండి అని వినయంగా చేతులు జోడించింది సౌమ్య...
మనుషుల్లో ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అని కాంతమ్మ
నిర్ఘాంతపోయింది...
ఉదయ్ భార్య వంక గర్వంగా చూసి మురిసిపోయాడు..
అంతరాత్మని నమ్మే వాడు ఏ తప్పు చెయ్యలేడని నా నమ్మకం కూడా...మరి మీరేమంటారు??😊
రేణుక సుసర్ల

ఇల్లాలు

మనసులో రేగే
కొత్త పులకింతకలు,
మదిలోన దాగే ,
ఎన్నేన్నో సందేహాలు,
అయిన వాళ్ళని విడిచి ,
ఉన్న ఇంటిపేరు మార్చి,
మనువాడిన వాడి వెంట,
అపారమైన నమ్మకంతో,
నడిచొచ్చిన ఘనత ,
ఆమెదే.....
తన కొత్త ప్రపంచంలో,
తనదైన వాటిని అన్ని వదులుకొని ,
నీతో ఇల్లు అనే ,
ప్రపంచాన్ని నిర్మిస్తుంది.
ఆమె.....
తన ప్రాణనికి సైతం,
లెక్క చేయక ,
నీ బిడ్డకి జన్మ నిచ్చి ,
తన జన్మని సార్ధకం చేసుకుంటుంది ఆమె....
ప్రేమ, త్యాగం,
ఓర్పు, నేర్పు
అన్నింటితో
తన దైన శైలిలో,
ఒక సంతోష కుటుంబాన్ని, నిర్మిస్తుంది ఆమె....
ఆమె
నీకు ఒక స్నేహితురాలు,
ప్రేయసి, ఒక తల్లి,
అన్నిటికి మించి
తన ఇష్ట ఇష్టాలని
తన వారికోసం త్యాగం చేసిన త్యాగశీలి...ఆమె
మన ప్రతి ఇంట
వెలసిన స్త్రీ మూర్తి
ఆమె ఒక ఇల్లాలు🙏
రేణుక సుసర్ల

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...