30, మార్చి 2017, గురువారం

ఎండ మావులు


ఎండ మావులు

ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండు అంత సౌఖ్యం మరొకటి లేదంటే ఏమో అనుకున్న కానీ మన NRI ల తంటాలు చూసాక ఔరా ఇది నిజమే కదా అనక తప్పలేదు
ఎదో దీపం ఉన్నపుడే ఇల్లు సద్దుకుందాం అన్న ఆత్రం
నాలుగు డబ్బులు వెనక వేసుకుందాం అన్న ఆలోచనలతో
నానా కష్టాలు పడి కన్న వాళ్ళని, కట్టు కున్న భార్యని, కన్న బిడ్డల్ని సహితం విడిచి విదేశాలకు వెళ్తారు...
ఆత్మాభిమానం దెబ్బతిన్న
అందలం ఎక్కాలని పట్టించుకోరు
పాపంవెట్టి చాకిరి చేస్తారు
ప్రాణాలను సైతం పణంగా పెడతారు
చేతి నిండా డబ్బులున్న అనుభవించలేని స్థితి
ఐన వాళ్ళు ఉన్న అక్కున చేరలేని దుస్థితి
ఇవన్నీ కోరితెచ్చుకున్న కష్టాలు కావ
ఉన్న దాంట్లో సంతృప్తి పడలేమా
మనం పెరిగినట్లు మన పిల్లల్ని పెంచితే తప్పేంటి కష్టం సుఖం వాళ్ళకి తెలియ నివ్వాలి
అంతేకాని మనం పెరిగినట్లు వాళ్ళని పెంచకూడదు అనుకొని
కోరిన దల్లా తెచ్చి ఇవ్వాలన్న తాపత్రయంలో వచ్చిన పాట్లు ఇవన్నీ..
అందుకే అందిన ద్రాక్ష తియ్యన అందనివి పుల్లన అనుకుంటే ఇంటికి వంటికి మంచిది😊
రేణుక సుసర్ల

అభిమానం

                        అభిమానం

అదొక చిన్న పల్లెటూరు..
దాంట్లో ఒక చిన్న పెంకుటిల్లు ఎదురుగ ఒక వేప చెట్టు ఉండేది..ఆ ఇంట్లో వాళ్ళు ,వచ్చే పోయే జనం పాపం దాన్ని తిట్టుకోని రోజంటు లేదంటే నమ్మండి..
ముదనష్టపు చెట్ట్టు రోజు ఆకురాలి ఛస్తోంది.. ఊడవలేక సస్తున్న అని ఆ ఇంటి ఇల్లాలు..వెధవ కాకి గోల దిక్కుమాలిన చెట్టుని నరికిస్తే పోలా అని ఆ యజమాని పాపం రోజు ఆ వేపచెట్టు ని ఆడిపోసుకునే వారు, ఆఖరికి
చెట్టు ఆకు గాలికి రాలిన , చెట్టు మీద పిట్టలు రెట్టలు వేసిన చెట్టుదే తప్పనట్టు తిట్టేవారు .
పాపం ఆ వేపచెట్టు నేను బతికుండగా ఈ జనం నన్ను ప్రేమగా చూడకపోతారా అని ఎదురుచూడం తోనే దాని జీవితం కాలం చెల్లింది..
ఒకానొక పెను తుఫానుకి ఆ చెట్టు వేళ్ళతో సహా నేల కొరిగింది..
అప్పుడు తెలిసిందండి ఆ ఇంటివాళ్ళకి , వచ్చే పోయే జనానికి దాని విలువ..ఇన్నాళ్లు ఆ వేప చెట్టు ఎండకి, వానకి ఎలా కాపాడింది ..
సేద తీరాడానికి వచ్చిన వాళ్ళకి కబుర్లు, కాలక్షేపం అన్ని ఇక లేకుండా పోయాయి.
ఏదైనా ఉన్నంతవరకు విలువ తెలీదు అలాగే మన నిత్య జీవితంలో అభిమాన పడ్డవారు తారసపడినపుడు నిర్లక్ష్యం చూపించకండి . మనకి కావాల్సినవుడు వాళ్ళు రావాలి
లేదంటే పోవాలి అంటే లెక్కసరిపోదు..మనం మనుషులం అండి వేపచెట్టు కాదు సుమండీ😉😉

28, మార్చి 2017, మంగళవారం

అమ్మాయి ఆరాటం అత్తగారి ఉబలాటం

అమ్మాయి ఆరాటం అత్తగారి ఉబలాటం

అప్పుడే పెళ్లై మొదట పండక్కి పుట్టింటికి వచ్చిన అమ్మాయి ఆరాటం అత్తారింటి పట్ల ఇంత అంత కాదండోయ్. పాపం మనసులో ఒక పక్క అమ్మని కష్ట పెడ్తున్నాను అనే బాధ ఇంకోపక్క అత్త వారి మెప్పు పొందాలన్న తపన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి...
ఇహ పండుగ రోజు నాడు అమ్మాయి హడావిడి చూడండి...
అమ్మ మా ఆయనకి పెరుగు గారెలు, బొబ్బట్లు చాలా ఇష్టమే కానీ కష్ట పడకే అమ్మ...
ఏమి వద్దు ఈ రెండు చేసి సింపుల్ గ వంకాయ పచ్ఛికారం, చేమ దుంపల వేపుడు మజ్జిగపులుసు పెడితే చాలమ్మ ఎక్కువ కష్టపడకే అమ్మ...
ఎటు వడియాలు, అప్పడాలు వేయిస్తావుగా... కొద్దిగా చింతకాయ పచ్చడి, నంచుకి పచ్చడి ముక్కలు ఉంటాయిగా...
అమ్మ ఎక్కువ అలిసిపోకే సింపుల్ గ చెయ్యి ఇవన్నీ చాలు...వాళ్ళు సర్దుకునే మనుషులే...
పాపం వెర్రి పిల్లకి నేనంటె ఎంత ప్రేమో అని పాపం ఆ పిచ్చి తల్లి పొంగిపోయింది నేను కష్ట పడితే అస్సలు చూడలేదు😢
ఇవే నేను చేయమంటే అని ఆలోచనలో పడ్డాడు ఆ వెర్రి బ్రాహ్మడు🤔🤔😁
రేణుక సుసర్ల

స్నేహం

నిస్పృహ అనేదే ఉండదు నీ సాంగత్యంలో
అలుపే ఉండదు నీ సాన్నిహిత్యంలో
ఓటమే వెనుతిరుగుతుంది నువ్వు నా వెంట ఉంటే
మనసుకి సాంత్వన చేకూరుతుంది నీ మాటలతో
నీ స్నేహ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్న గడ్డిపరకను నేను మిత్రమా
రేణుక సుసర్ల

మనసు వ్యధ..

మనసు వ్యధ..
చెప్పుకోలేను బాధ నుండి తప్పుకోలేను
ఐన వాళ్ళు అవమానపరిస్తే అభిమానం అనుకున్న..
అవసరానికి ప్రతి ఒకళ్ళు నా తలుపు తడితే వాళ్ళకి నేనె లోకం అనుకున్న
ఆలోచించ కుండా అడిగినదల్లా చేస్తే వాళ్ళకి ఆపేక్ష పెరుగుతుంది అనుకున్న
చీటికీ మాటికి చీదరించుకుంటు ఉంటె వాళ్ళకి నా మీద మమకారం అనుకున్న
కానీ చివరికి నా ప్రేమ వాళ్లకి నా చేతకాని తనం..అని తెలిసిన నాడు మనసు ముక్కలైంది గుండె ఆగిపోయింది
ఏడవడానికి కంట్లో నీళ్లు కూడా కరువయ్యాయి...
నా మనసు కూడా నన్ను దీనంగా వేడుకుంది మళ్ళా ఇదే తప్పు మాటిమాటికి చెయ్యొద్దని😢
రేణుక సుసర్ల

27, మార్చి 2017, సోమవారం

సొగసు చూడ తరమా

రవి వర్మ చేతిలో కుంచెవా
లేక బాపు చిత్రానివా
అజంతా శిల్పానివా
హొయలు ఒలికే పాలరాతి బొమ్మవా
చందమామ కూడా ఈర్ష వచ్చే అందానివా
ఎవరివి నీవెవరివి
ఓ నా ప్రియ సఖీ
నీ సొగసు చూడతరమా

రేణుక సుసర్ల

రైతన్న కష్టాలు

రైతన్న కష్టాలు
హలం పట్టి పొలం దున్ని
పంట చేతికిచ్చి నోడి
పగలనక, రేయనక
కాయ కష్టం చేసినోడి
కూడు, గుడ్డ కరువాయే.
ఎండనక, వాననక
చినుకు చినుకు కూడగట్టి
ఆకలి మంట తీర్చినోడి
బ్రతుకు మంట కాలిపోయె.
ప్రకృతివింత, వడ్డీలమోత,
మార్చాయి రైతన్న తలరాత...
బరువెక్కిన గుండెతో
ఆగలేని బాధతో
నేలకొరిగె
పుడమి తల్లి ముద్దు బిడ్డ
రేణుక సుసర్ల

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...